ఇక‌.. మ‌న సైనికుల ర‌క్తం చింద‌దు!

Update: 2017-08-12 17:12 GMT
ప్ర‌పంచంలోని అతి పెద్ద దేశాల్లో రెండో స్థానంలో ఉన్న మ‌న‌కు అన్ని వైపులా ఇబ్బందులే. చైనా - పాకిస్థాన్‌ ల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు క‌వ్వింపులు మామూలే. ఇక‌ స‌రిహ‌ద్దుల్లోకి వెళ్లిన సైన్యం తిరిగి శిబిరానికి చేరుకునేలోగా ఎవ‌రు వ‌స్తారో.. ఎవ‌రు ప్రాణాలు కోల్పోతారో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే. గ‌త ఆరు నెల‌లుగా అట్టుడుకుతున్న జ‌మ్ము క‌శ్మీర్‌ లో అయితే నిత్యం అక్క‌డి వేర్పాటు వాదుల‌తో మ‌న సైనికుల‌కు పోరు త‌ప్ప‌డం లేదు. దీంతో సైనికులు వాళ్ల రాళ్ల దాడిలో గాయ‌ప‌డుతూనే ఉన్నారు. స‌రిహ‌ద్దుల్లో అయితే ర‌క్తం చిందిస్తూనే ఉన్నారు. ఇలా గ‌డిచిన కొన్ని ద‌శాబ్దాలుగా భార‌త దేశం యువ సైనికుల‌ను పోగొట్టుకుంటూనే ఉంది. స‌రిహ‌ద్దుల్లో యువ ర‌క్తాన్ని చిందిస్తూనే ఉంది.

ఇలా ఎన్నాళ్లు?!  సాంకేతికత అభివృద్ధి చెందాక, అన్ని రంగాల్లోనూ మానవ ప్ర‌మేయం దాదాపు త‌గ్గిపోయిన త‌ర్వాత కూడా ఇంకా మ‌న సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?  ప‌చ్చ‌ని స‌రిహ‌ధ్దులు ముష్క‌రులు జ‌రిపే కాల్పుల్లో మ‌న సైనికుల వెచ్చ‌టి ర‌క్తంతో త‌డిసిపోవాల్సిందేనా? ఇలా ఎన్నాళ్లు?  ఎన్నేళ్లు? ఈ ఆలోచ‌న నుంచి పుట్టిందే.. రోబో ఆర్మీ!  అచ్చం సైనికులు మాదిరిగానే ఉండే రోబోలు.. మ‌న స‌రిహ‌ద్దుల‌ను కాపాడ‌నున్నాయి. అంతేకాదు, శ‌త్రువుల‌పై విజృంభించ‌నున్నాయి కూడా. ఈ రోబోల‌ను డీఆర్‌డీవో అత్య‌ధునాత‌న సాంకేతిక‌త‌ను వినియోగించి స‌మ‌కూర్చింది. ఇప్పుడు ఇవి సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి.

 జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు, అల్లరి మూకల రాళ్ల దాడులను ఎదుర్కోవడంలో సైన్యానికి ఈ రోబోలు సహకరిస్తాయి. ముష్కరమూకల విధ్వంసాలను అదుపు చేసే సమయంలో సైనికులకు ఎదురవుతున్న కష్టాలను తగ్గించేందుకు భార‌త‌ సైన్యం ఈ రోబోటిక్ వెపన్స్ ను వాడనుంది. తమకు 544 రోబోలు అవసరమంటూ సైనికాధికారులు పంపిన ప్రతిపాదనకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది. డీఆర్డీవో గత ఎనిమిది నెలలుగా ఈ ప్రాజెక్టుపై పని చేస్తోంది. విభిన్నమైనటువంటి వాతావరణ, ప్రాదేశిక పరిస్థితుల్లో పని చేస్తున్న సైనికులకు దీటుగా ఈ రోబోలను రూపొందించారు. పలు కీలక స్థావరాల వద్ద వీటిని మోహరింపజేయనున్నారు. ఫ‌లితంగా భార‌త సైనిక ర‌క్తం ఇక‌పై చుక్క కూడా చింద‌కుండానే ముష్క‌రుల‌కు మ‌నం బుద్ది చెప్పొచ్చ‌న్న‌మాట‌.
Tags:    

Similar News