సెక్స్ కోసం రోబోలు.. సేఫ్ అండ్ డిఫరెంట్ అంట!

Update: 2016-09-23 08:24 GMT
ఎంత ప్రపంచీకరణ అయితే మాత్రం, ఎంత టెక్నాలజీ అభివృద్ధిలోకి వస్తుంటే మాత్రం... మరీ స్త్రీ పురుషుల మధ్య పడకగది విషయాలు - సెక్స్ సంబంధాలకు కూడా మిషన్స్ కావాలా? స్త్రీ పురుషుల మధ్య ఉండే అద్భుతమైన కలయికకు - పడక గది అనుభూతులకు కూడా రోబోలు వస్తున్నాయా? ఇంక మనిషికి - మనిషికి మద్య బంధం పోయి - మనిషికీ - యంత్రానికి మద్య కొత్త బంధం రానున్న రోజుల్లో జరగబోతుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. అవును... సెక్స్ కోసం రోబోలను తయారుచేస్తున్నారు.

ఇకపై సెక్స్ అవసరాలకు - శ్రంగార కోరికలకు స్త్రీ - పురుషుడిపైనా.. పురుషుడు - స్త్రీ పైనా ఆధారపడాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు జోయెల్ స్నెల్. ప్రేమికులకు - భార్యలకు భర్తల కంటే గొప్ప పడక సుఖాన్ని అందించే రోబోలు రెడీ అవుతున్నాయని చెబుతున్నాడు కిన్ వుడ్ కాలేజీకి చెందిన ఈ రోబోటిక్ నిపుణుడు. ప్రపంచీకరణ ప్రభావం ప్రస్తుత మానవ సంబంధాలను అత్యంత యాంత్రికంగా మార్చేస్తున్న తరుణంలో.. రాబోయే రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధాలు కూడా యాంత్రికం చేయడానికి తాను తెగ కష్టపడుతున్నాడట! తమను కొనుక్కుని వెళ్లిన వ్యక్తుల టెస్ట్ కి తగ్గట్లు ఈ సెక్స్ రోబోలు వ్యవహరిస్తాయని, వీటితో అత్యంత క్రియేటివిటిగా అనుభూతిని పొందొచ్చని చెప్పుకొస్తున్నారు సెక్స్ రోబోల మీద ప్రయోగాలు జరుపుతోన్న నిపుణులు.

ఈ విషయాలపై మరింత క్లారిటీ ఇస్తున్న జోయెల్... మనుషుల కంటే రోబోలే ఆ విషయంలో అత్యుత్తమంగా వ్యవహరిస్తాయని, మనుషులకు సాధ్యం కాని కొన్ని సెక్స్ రీతులను సైతం ఈ రోబోల ద్వారా అనుభవించవచ్చునని చెబుతున్నారు. ఈ పనిచేయడంలో కాస్త సోషల్ కాజ్ కూడా ఉందని చెబుతున్న జోయ్... సెక్సువల్ క్రైమ్స్ పై పోరాటం చేయడానికి ఈ రోబోలు ఉపకరిస్తాయని చెప్పుకొస్తున్నాడు. అంతే కాకుండా సురక్షితమైన సెక్స్ కి కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయని అంటున్నాడు. అయితే.. మనుషుల మధ్య సెక్స్ సంబంధాలకు రోబోలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని సెక్సాలజిస్టులు, ప్రజాస్వామిక వాదులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తుండగా... ఇలా సెక్స్ రోబోలను ప్రోత్సహించడం మంచిది కాదని సెక్స్ థెరపిస్ట్ గుర్ ప్రీత్ సింగ్ హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News