రోహిత్ నోట బూతులు.. వీడియో వైరల్..!

Update: 2021-01-19 11:47 GMT
విజయమో, వీర స్వర్గమో తేలబోతున్నప్పుడు..గెలుపు ఇరువురి మధ్యా దోబూచులాడుతున్నప్పుడు.. విజయాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేనప్పుడు.. ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుసా? నరాలు తెగిపోతాయి.. ఊపిరి స్తంభించిపోతుంది.. గుండె లక్షల నాటకల్ మైళ్ల వేగంతో కొట్టుకుంటుంది.. ఇక, ఫలితం తేలిన ఆ చివరి క్షణంలో అప్పటి వరకూ అనుభవించిన ఒత్తిడి మొత్తం మాటల రూపంలో వెళ్లిపోతుంది. కొందరు ఈలవేసి గోల చేస్తే.. మరికొందరు బావురుమంటారు.. ఇంకొందరు మాత్రం కసిగా బూతుల రూపంలో ప్రెషర్ ను అవతలికి నెట్టిపారేస్తారు. బ్రిస్బేన్ లో రోహిత్ శర్మ ఇదే చేశాడు!

అసలే ఆస్ట్రేలియా పర్యటన.. గత రికార్డు దారుణంగా ఉంది.. సీనియర్లంతా గాయాలతో వెళ్లిపోయారు. మిగిలింది కుర్ర సైన్యం. చెరో టెస్టు విజయంతో సిరీస్ సరిసమానం. ఇది గెలిచినోడిదే కప్పు. అది కూడా చివరి వరకు చేరింది. ఇప్పుడు చెప్పండి ఎవరి పరిస్థితైనా ఎలా ఉంటుంది? అందరూ మునివేళ్లపై నిలబడిపోయారు. రాజీలేని పోరాటం చేసిన 'యంగ్ ఇండియా' భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.

టెస్టు మ్యాచ్ లో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం అత్యంత దుర్లభం. మహామహులే చెమటోడుస్తారు. అలాంటిది.. ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 328 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. అయినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని యంగ్ ఇండియా అనూహ్య రీతిలో ఛేదించింది. రిషభ్‌ పంత్‌(89 నాటౌట్), శుభ్‌మన్ గిల్(91) అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టగా.. పుజారా(56) తనదైన డిఫెన్స్ తో జట్టును ఆదుకున్నాడు. అందరూ కలిసి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా చరిత్రను తిరగరాసింది.

అయితే.. ఈ విజయానందంలో రోహిత్ శర్మ అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. భారత్ విజయానికి మూడు పరుగులు కావాల్సిన స్థితిలో జోష్ హజెల్ వుడ్ వేసిన లో ఫుల్ టాస్‌ను మిడాఫ్ మీదుగా బంతి బౌండరీ చేరింది. ఇంకేముంది..? భారత శిభిరంలో సంబరాలు మిన్నంటాయి.

ఈ ఉద్విగ్న క్షణాల్లో.. కెప్టెన్ రహానే, వైస్‌కెప్టెన్ రోహిత్ శర్మ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ "Bhe**hod అంటూ అసభ్య పదాన్ని ఉపయోగించాడు. ఇది టీవీ కెమెరాల్లో స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే.. క్రికెట్‌లో ఆటగాళ్లు ఇలాంటి పదాలను తరచుగా ఉపయోగిస్తుంటారు.


Full View
Tags:    

Similar News