మరొక్క వారం రోజులే.. మనందరినీ మురిపించేందుకు, మజా పంచేందుకు వచ్చేస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ సారి పది జట్లతో మరింత రంజుగా సాగనుంది లీగ్. ఆటగాళ్లు మారిపోవడం, జట్ల స్వరూపం మారిపోవడమే దీనికి కారణం. అయితే, జట్టు ఎంత బాగున్నా, దానిని నడిపించడం, నిర్ణయాలు తీసుకోవడం అదీ సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం విజయాలకు కీలకం. అందుకనే అందరూ విజయవంతమైన సారథులు కాలేరు. విరాట్ కో్హ్లి వంటి దిగ్గజ ఆటగాడు సైతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి టైటిల్ అందించలేకపోయాడు.
రోహిత్ శర్మ మాత్రం 5 సార్లు ముంబైని గెలిపించాడు. మహేంద్ర సింగ్ ధోని నాలుగుసార్లు కప్ చెన్సై సూపర్ కింగ్స్ కు కప్ తెచ్చిపెట్టాడు. దీన్నిబట్టే సారథి ఎవరో, విజయ సారథి ఎవరో తెలుసుకోవచ్చు. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎవరి విజయాల శాతం ఎంతనో చూద్దామా? లీగ్ చరిత్రలో విజయవంతమైన టాప్-5 కెప్టెన్లు ఎవరు? వారి విజయ శాతం ఎంత ఉంది? తెలుసుకుందామా? పెద్దగా పేరు లేకున్నా..
కామెరూన్ వైట్..పెద్దగా పేరు లేని ఆస్ట్రేలియా క్రికెటర్. కానీ, ఐపీఎల్లో ఆర్సీబీ, దక్కన్ ఛార్జర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. 2012 సీజన్ మధ్యలో సంగక్కర నుంచి దక్కన్ ఛార్జర్స్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది సన్ రైజర్స్కూ కెప్టెన్గా చేశాడు. మొత్తంగా 12 మ్యాచ్లకు సారథ్యం వహించిన వైట్.. 7 మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. ఇతడ విజయ శాతం 58.33. ధోని: ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఒకే జట్టుకు కెప్టెన్గా కొనసాగుతుంది ధోనీ ఒక్కడే. చెన్నై సూపర్ కింగ్స్కు సారథ్యం వహిస్తున్న ఇతడు ఇప్పటివరకు నాలుగు సార్లు జట్టుకు ట్రోఫీని అందించాడు. మొత్తంగా 188 మ్యాచులకు సారథ్యం వహించిన ధోనీ.. 110 మ్యాచుల్లో విజయవంతమయ్యాడు. 2016, 2020 తప్ప ప్రతి సీజన్లో ధోనీ చెన్నై జట్టును ప్లేఆఫ్స్కు తీసుకువెళ్లాడు. ఇతడి విజయశాతం 58.8గా ఉంది. ఈ లిస్ట్ లో ధోనిది నాలుగో స్థానం.
సచిన్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా విఫలమైనా సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో మాత్రం తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. ఇతడి సారథ్యంలో ముంబై జట్టు 2010 సీజన్ ఫైనల్ చేరుకుంది. కానీ, ఫైనల్ లో చెన్నై చేతిలో ఓడిపోయింది. మొత్తంగా ఐపీఎల్లో 51 మ్యాచ్లకు సారథ్యం వహించిన సచిన్.. 30 మ్యాచ్ల్లో విజయవంతమయ్యాడు. ఇతడి విజయ శాతం 58.82గా ఉంది. ఈ లిస్ట్ లో మూడో స్థానం ఇతడిదే. ఇక టీ20 లీగ్లతో పాటు అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్గా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తన సత్తా నిరూపించుకున్నాడు. 2017లో పుణె వారియర్స్ కెప్టెన్గా బాధ్యతలు అందుకున్న స్మిత్.. జట్టును అద్భుతంగా ముందుకు నడిపాడు. రాజస్థాన్ రాయల్స్కు కూడా కొన్ని సీజన్లకు సారథిగా వ్యవహరించాడు. మొత్తం 42 మ్యాచులకు కెప్టెన్సీ వహించిన స్మిత్ 25 విజయాల్ని అందించాడు. ఇతడి విజయ శాతం 59.52గా ఉంది. ఈ లిస్ట్ లో రెండో స్థానం స్మిత్ దే.
సారథ్యంలోనూ రో‘‘హిట్ మ్యాన్’’
ముంబై ఇండియన్స్ జట్టుకు 8 ఏళ్లుగా కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ.. టీమ్కు ఐదు సార్లు విజయాలను అందించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్ అనడంలో సందేహం లేదు. ఇప్పటివరకు 116 ఐపీఎల్ మ్యాచులకు సారథ్యం వహించిన అతడు.. అందులో 70 సార్లు విజయాన్ని అందుకున్నాడు. రోహిత్ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో కప్ను సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్. ఇతడి విజయ శాతం 60.34. అంటే అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఇతడే.