అభిమానులు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానే వచ్చింది. మరికొన్ని గంటల్లోనూ ముంబై ఇండియన్స్.. రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి. ఐపీఎల్ అంటేనే ఓ పండగ.. అటువంటింది తొలి మ్యాచ్లో రెండు దిగ్గజ టీంలు ఆడుతుంటే ఈ కిక్కు మరో లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు అత్యధిక సార్లు ఐపీఎల్ లో చాంపియన్ గా నిలిచింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తుంటారు. దీంతో తొలి రోజు మ్యాచే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగనున్నది.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఈ సారి కూడా ఫ్యాన్స్ ఎవ్వరినీ అనుమతించడం లేదు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీతో కలిసి రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. మిగతా రంగాలతో పోల్చుకుంటే క్రికెటర్లు ఎంతో అదృష్ట వంతులని ఆయన పేర్కొన్నాడు. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది ఉపాధి కోల్పోయారు. కనీసం పనికూడా చేసుకోలేకపోతున్నారు. కానీ క్రికెటర్లు మాత్రం వాళ్ల పనిచేసుకోగలుగుతున్నారు ఇది గొప్ప అదృష్టం అని అన్నారు. ఇక గత ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. గాయం కారణంగా చాలా బాధపడ్డానని చెప్పారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘ ప్రస్తుతం టీమిండియా జట్టు ఎంతో పటిష్ఠంగా ఉంది. ఆస్ట్రేలియా టూర్లో, స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ సీరిస్ లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా యువ క్రికెటర్లు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ఇంగ్లండ్ ను ఓడించడం అంత ఈజీ కాదు.. కానీ మన క్రికెటర్లు ఆ పనిని చేసి చూపించారు’ అంటూ టీమిండియాపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ జట్టు ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసుకున్నది.
బయో బబుల్ కష్టాలను ఓర్చుకుంటాం అని రోహిత్ అన్నాడు. యూఏఈలో చాలా ఎంజాయ్ చేశామని రోహిత్ గుర్తుచేసుకున్నాడు. మరోవైపు స్పిన్నర్ చావ్లాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిలో ఎంతో దూకుడు, కసి ఉందని పేర్కొన్నాడు. మొత్తానికి ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం ఒక్క మనదేశ ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్నారు.