హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. అతగాడి ఆత్మహత్యపై పలు సందేహాలు ఇప్పటివరకూ వ్యక్తమయ్యాయి. అతడి కుటుంబ సభ్యులు.. సన్నిహితులు.. సహచరులు పలువురు అతని మరణంపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ మధ్యనే రోహిత్ ఆత్మహత్యను లోక్ సభలో తన ప్రసంగంలో ప్రస్తావించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం.. అతని మరణాన్ని ఎవరు కన్ఫర్మ్ చేశారంటూ ప్రశ్నించటం.. వైద్యుల్ని అనుమతించలేదంటూకొన్ని సందేహాలు వ్యక్తం చేయటం తెలిసిందే.
తాజాగా వెల్లడైన పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. రోహిత్ వేముల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేల్చింది. ఉరితాడు మెడకు బిగుసుకుపోవటం వల్లే రోహిత్ చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అదే సమయంలో.. రోహిత్ శరీరం మీద ఎలాంటి అనుమానాస్పద గాయాలు లేవని తేల్చి చెప్పింది. తాజాగా వెల్లడైన పోస్ట్ మార్టం నివేదికతో.. రోహిత్ మరణంపై సందేహాలు వ్యక్తం చేసే వారి మాటల్లో నిజం లేదన్న విషయం తేలిపోయినట్లే.