తమది వడ్డెర కులమని దివంగత రోహిత్ తండ్రి వాదిస్తుంటే.. రోహిత్ తల్లి రాధిక.. సోదరుడు రాజులు సరికొత్త నిర్ణయాన్ని వెల్లడించారు. తాము దళితులం కాబట్టే వివక్షను ప్రదర్శించారని.. అందుకే అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని అంబేడ్కర్ మాదిరి తాము బౌద్ధంలోకి మారాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అసమానతలకు తావు లేనిదని అంబేడ్కర్ బౌద్ధాన్ని స్వీకరించారని.. అలాంటి సమానత్వాన్నే తాము కోరుకోవటంతో.. ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తామని రోహిత్ తల్లి.. సోదరుడు చెబుతున్నారు. ఈ రోజు ముంబయిలో జరిగే ఒక కార్యక్రమంలో వారిద్దరూ బౌద్ధంలోకి మారబోతున్నట్లు ప్రకటించారు. రోహిత్ స్నేహితులు పలువురు కూడా బౌద్ధాన్ని స్వీకరిస్తారని చెబుతున్నారు.
ఉగ్రవాద కార్యకలాపాల్లో దోషిగా తేలిన మెమన్ కు ఉరిశిక్షను అమలు చేయటాన్ని రోహిత్ నిరసించటం.. దానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించటాన్ని వర్సిటీలో ఏబీవీపీ వ్యతిరేకించింది. అప్పటి నుంచి వారి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో అతగాడి ఆత్మహత్య చోటు చేసుకుంది. వర్సిటీలో దళితుల పట్ల వివక్ష నిజంగానే ఉందనుకుంటే.. ఇన్నేసి నిరసన కార్యక్రమాలు సాధ్యమయ్యేవా? అన్నది ఒక ప్రశ్న. మొత్తంగా చూస్తే.. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రోహిత్ తల్లి.. సోదరుడు తమదైన శైలిలో తమ ఇష్యూను మరోసారి వార్తాంశంగా మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.