ప్రముఖ సినీ నటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తనపై సాగుతున్న పలు ప్రచారాలపై ఓ మీడియా సంస్థ ప్రత్యేకంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తన పొలిటికల్ జర్నీ, సినీరంగం వంటి అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా సదరు జర్నలిస్ట్...రోజాకు పేకాట ఆడటం అలవాటు అనే ప్రచారం ఉంది నిజమా? అని ప్రశ్నించగా... ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ...`` ఇలాంటి కొత్త కొత్త ప్రచారాలు ఎక్కడి నుంచి కనిపెడుతున్నారో అర్థం కావడం లేదు`` అని ఆమె తప్పుపట్టారు.
అయితే అక్కడితో సదరు జర్నలిస్టు ఆ విషయాన్ని పక్కనపెట్టకుండా మొదటి సినిమాలో నటించే సమయంలో పేకాడుతూ ఉన్నారనే అభిప్రాయాన్ని సదరు ప్రస్తావించారు. దీంతో ఆరోజు అసలేం జరిగిందో వివరించారు. `` మొదటి సినిమా రోజు నేను చాలా టెన్షన్‌గా ఉన్నాను. నాకేమో యాక్టింగ్ రాదు. పైగా సినిమా నిర్మిస్తున్నది సొంత ఊరు తిరుపతిలో కావడంతో ఒక స్థాయిలో భయంతో ఉన్నారు. వేరే ఆలోచనలకు తావెక్కడిది? షూటింగ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు పారిపోదామని ఆలోచించానే తప్ప మరో ఆలోచన లేదు`` అని చెప్పారు. మరో సినిమా సమయంలో కూడా పేకాడుతూ ఉన్నారని ప్రచారం సాగిందనే విషయాన్ని ఆ జర్నలిస్టు ప్రస్తావించారు. బాలకృష్ణ గారి సినిమా భైరవద్వీపం సినిమా సమయంలో జరిగిన అసలు విషయం వేరు.. ``బాలకృష్ణ గారికి సరదాగా పేకాడటం ఇష్టం. భైరవద్వీపం షూటింగ్ సమయంలో సెట్లో ఉన్నసత్యానారాయణ గారు సహా అందర్నీ బాలకృష్ణగారు సరదాఆ పేకాడేందుకు రమ్మని పిలిచారు. అంతేకాదు అప్పుడప్పుడు డబ్బులు పెట్టి మరీ టైంపాస్ కోసం బాలకృష్ణ గారు పేకాట ఆడించేవారు`` అని రోజా గుర్తుచేశారు.
తిరిగి ఈ చర్చను కొనసాగించేందుకు ఆ జర్నలిస్ట్...ఆ సినిమా తర్వాత మీకు పేకాటపై ఇంట్రెస్ట్ కుదిరిందా అంటూ ప్రశ్నించగా...ఎమ్మెల్యే రోజా వివరణ ఇచ్చారు. ``అలాంటిదేమీ లేదు. మా అమ్మ చంపేస్తుంది...ఇంట్లో పేకాడటం అనేది అస్సలే కుదరదు. ఎప్పుడో ఇలా షూటింగ్‌లో అది కూడా తప్పనిసరి అయితేనే`` అని వివరించారు.