వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై మరోమారు ఘాటుగా మండిపడ్డారు. తమ పార్టీ నాయకుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడమే అధికార తెలుగుదేశం పార్టీ నేతల పని అన్నట్లుగా కనిపిస్తోందని రోజా వ్యాఖ్యానించారు. అందులోనూ టీడీపీ నేతలు నోరు తెరిస్తే జగన్ జైలుకు వెళ్లారని అంటారని అయితే పూర్తి అవగాహనతో మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని వ్యతిరేకించినందుకే జగన్ జైలుకు వెళ్లారన్నారు. ఈ కుట్రలో టీడీపీ-కాంగ్రెస్ నేతలకు భాగస్వామ్యం ఉందని రోజా మండిపడ్డారు. అయితే తనపై ఉన్న కేసుల విషయంలో అప్పటి హోం మంత్రి చిదంబరం కాళ్లను పట్టుకొని బయటపడ్డారని రోజా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నవ నిర్మాణ దీక్షలన్నీ నయవంచనకు మారుపేరుగా కనిపిస్తున్నాయని రోజా మండిపడ్డారు. ప్రజలను మూడేళ్ల పాటు మధ్య పెట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దీక్షల పేరుతో దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ ఊరోజా ఏపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. ‘నవనిర్మాణ దీక్ష కాదు, నారా వారి నయవంచన దీక్ష’ అని విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చి ప్రజల మెప్పు పొంది మరోమారు అధికారంలోకి రావాల్సింది పోయి..అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని రోజా విమర్శించారు. టీడీపీ నేతలు చేసిన పాపాలు కడుక్కునేందుకు 24 గంటలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇటీవల నిర్వహించిన టీడీపీ మహానాడులో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అని రోజా ధ్వజమెత్తారు.చంద్రబాబు పరిపాలనతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, మూడేళ్ల ఆయన పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్లిందని ధ్వజమెత్తారు. దీక్షల పేరుతో ప్రజాధనం వృధా చేస్తున్నారని, ప్రజల సొమ్ముతో ఎన్ని దీక్షలైనా చేయగలరని రోజా మండిపడ్డారు. ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ దొంగ దీక్షలు చేస్తున్న టీడీపీ నాయకులను అడుగడుగునా అడ్డుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/