టీడీపీ యువనేత - మాజీ మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పరోక్షంగా ఊహించని కౌంటర్ ఇచ్చారు. తన చర్యతో లోకేష్‌కు పరోక్షంగా క్లాస్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి అఖిలపక్ష కార్యచరణ కమిటీ నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించగా నారా లోకేష్ బుల్లెట్ వాహనం నడిపించారు. అయితే, ఆయనపై పలు విమర్శలు వచ్చాయి. లోకేష్ కార్యక్రమానికి కౌంటర్ అన్నట్లుగా రోజా తాజా కార్యక్రమం ఉందంటున్నారు.
పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుంచి బైక్ ర్యాలీని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ - సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రారంభించారు. స్వయంగా నారా లోకేష్ బుల్లెట్ వాహనాన్ని నడపగా నారాయణ వెనుక కూర్చొన్నారు. మెయిన్ బజార్ - పార్క్ రోడ్ - గోపాలకృష్ణ ధియేటర్ సెంటర్ లో ప్రజలు సంఘీభావ బైక్ ర్యాలీలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. అయితే, లోకేష్ హెల్మెట్ ధరించకపోవడంతో నెటిజన్లు ఆయన తీరుపై మండిపడ్డారు. రోడ్డు భద్రత చర్యలను మంత్రిగా పనిచేసిన వ్యక్తి పాటించరా? అంటూ మండిపడ్డారు.
అయితే, ఊహించని రీతిలో రోజా అదే విషయంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొని లోకేష్‌కు పరోక్ష కౌంటర్ ఇచ్చారు. 31 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎమ్మెల్యే రోజా బైక్ నడిపించారు. బైక్ నడిపిస్తూ ఎమ్మెల్యే రోజా వేగం కన్నా ప్రాణం మిన్న అంటూ నినాదాలు చేస్తూ వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని రోజా విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంతో ప్రస్తుత రాజధాని మంగళగిరిలో లోకేష్ చేసిన కార్యక్రమానికి కౌంటర్ ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.