వైసీపీ ఫైర్ బ్రాండ్ - చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మొన్నటి దాకా తనపై టీడీపీ సర్కారు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయించుకునేందుకు సుదీర్ఘంగానే న్యాయ పోరాటం చేశారు. ఈ క్రమంలో ఓ పక్క నియోజకవర్గ సమస్యలపై గళమెత్తుతూనే... మరోవైపు కోర్టుల చుట్టూ తిరిగారు. కోర్టుల ద్వారా పెద్దగా ఉపశమనం లభించకున్నా... ఆమెపై విధించిన ఏడాది పాటు సస్పెన్షన్ ఇటీవలే ముగిసిపోవడం, ఆమె అసెంబ్లీలో తిరిగి అడుగు పెట్టడం జరిగిపోయాయి. మొన్నటి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరైన రోజా... తన నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో నిన్న నగరి నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు పురపాలక సంఘం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను చూసిన ఆమె... ఒక్కసారిగా షాక్ తిన్నారట. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తున్నామంటూ చంద్రబాబు సర్కారు చెబుతుంటే... ఇక్కడ అందుకు విరుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జాబితాలో మొత్తం టీడీపీకి చెందిన వారే ఉన్నారని, ఇతర పార్టీలకు చెందిన వారిలో ఒక్క పేరైనా ఉందా? అంటూ ఆమె అధికారులను నిలదీశారు. సంక్షేమ పథకాలన్నీ పచ్చ పార్టీ నేతలు, వారు సిఫారసు చేసిన వారికే దక్కుతున్నాయని, ఇదేం తీరని ఆమె ప్రశ్నించారు. లబ్ధిదారుల జాబితా చేతిలో పట్టుకుని రోజా ప్రశ్నలు సంధించడంతో ఏం సమాధానం చెప్పాలో కూడా అధికారులకు తోచలేదట.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తన సొంత వాళ్ల జేబులు నింపడానికే ప్రాధాన్యం ఇస్తున్నారడానికి ఇదొక నిదర్శనమని, ఆలయాల్లో కూడా పచ్చ పార్టీ నేతలు రాజ్యమేలుతున్నా... అదికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే టీడీపీ నేతలు ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ఇట్టే అర్థమవుతోందని ఆమె అన్నారు. రోజా సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయినట్లు సమాచారం. ఓ ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో పాలక పక్షం ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి నిరాకరిస్తోందని స్వయంగా అధికారులతోనే చెప్పించిన రోజా... టీడీపీ పాలనలో అభివృద్ధి ఏ తరహాలో జరుగుతుందో చూపించేశారన్న వాదన వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/