చంద్ర‌బాబు - లోకేష్ ల‌పై రోజా ఫైర్..మామూలుగా లేదు!

Update: 2020-01-20 05:15 GMT
మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్  ల‌పై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాల‌ను ప్ర‌స్తావించి వారిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ముందుగా చంద్ర‌బాబు నాయుడును ఉద్దేశించి రోజా విజ‌న్ 2020 అంశాన్ని ప్ర‌స్తావించారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు విజ‌న్ 2020 అనే వార‌ని, అంటే ఇర‌వై మంది ఎమ్మెల్యేలు - ఇర‌వై గ్రామాలా అని రోజా ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు నాయుడు ఇర‌వై గ్రామాల‌కు ప్ర‌తిప‌క్ష నేత‌గా  - ఇర‌వై మంది ఎమ్మెల్యేల‌ను వెంట పెట్టుకున్నార‌ని రోజా ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ప్ర‌తిప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని - మూడు ప్రాంతాల‌కూ స‌మ‌న్యాయం జ‌ర‌గడాన్ని చంద్ర‌బాబు నాయుడు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నార‌ని ఆమె ప్ర‌శ్నించారు.

ఇక బీఎన్ రావు నివేదిక ఏంటి?  బోస్ట‌న్ కన్స‌ల్టెంట్.. ఏంటి? అంటూ నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నార‌ని, వారికి రాజ‌ధాని క‌ట్టిన అనుభ‌వం ఉందా అని లోకేష్ వ్యాఖ్యానించాడ‌ని, అందుకే లోకేష్ ను ప‌ప్పు అంటార‌ని రోజా ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హ‌యాంలో నారాయ‌ణ నేతృత్వంలో క‌మిటీని వేశార‌ని, నారాయ‌ణ‌కు ఎన్ని రాజ‌ధానులు క‌ట్టిన అనుభ‌వం ఉంది? అని రోజా ప్ర‌శ్నించారు. రాజ‌ధాని  కాదు క‌దా, క‌నీసం సొంత కాలేజీల్లో టాయ్ లెట్లు క‌ట్టిన అనుభం కూడా లేదు నారాయ‌ణ‌కు అంటూ.. రోజా విమ‌ర్శించారు.

చంద్ర‌బాబులా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ఉండ‌ద‌ని, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ బాగుప‌డేలా నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని, చంద్ర‌బాబు నాట‌కాల‌ను ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ విశ్వ‌సించే ప‌రిస్థితి లేద‌న్నారు. కూక‌ట్ ప‌ల్లి నుంచి జ‌నాల‌ను త‌రలించి..చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తూ ఉన్నార‌ని అన్నారు.
Tags:    

Similar News