రోజాతో పెట్టుకుంటే ‘గాలి’ తీసేసింది..

Update: 2017-12-04 15:47 GMT
కర్ర కన్నా - కత్తి కన్నా - గన్ కన్నా కూడా నోరు చాలా పవర్ ఫుల్. అదే... వాగ్ధాటికి ఉన్న శక్తి అది. అందుకే నోరున్నోళ్లతో పెట్టుకోకూడదంటారు. కానీ... టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పదేపదే అదే పొరపాటు చేసి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆయన మరోసారి తన రాజకీయ ప్రత్యర్థి , వైసీపీ ఎమ్మెల్యే రోజా మాటల తూటాలకు దొరికారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు తిరుమల దర్శనం టిక్కెట్లు కూడా అమ్ముకునే రకమంటూ రోజా తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు చేశారు. ఆయన అనుచరులు దోపిడీలకు పాల్పడుతుంటారన్నారు.
    
అంతేకాదు.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆయన తనకు క్షమాపణలు చెప్పాలని... లేదంటే ఆయన చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని ఆమె హెచ్చరించారు.
    
చిత్తూరు జిల్లా మాజీ కలెక్టర్‌ సిద్ధార్థజైన్‌ తో కలిసి రోజా హంద్రీనీవా ప్రాజెక్ట్ అలైన్‌ మెంట్‌ మార్చారని ముద్దు కృష్ణ‌మ‌నాయుడు కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రోజా తీవ్రంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన‌ ఆధారాలను ఆయ‌న‌ బహిర్గతం చేయాల‌ని అన్నారు. తనకు ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

150 సినిమాల్లో హీరోయిన్ గా నటించి నిజాయతీగా డబ్బు సంపాదించానే కానీ, సూట్‌ కేసు చేతిలో పట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి కోట్లాది రూపాయలు సంపాదించలేద‌ని అన్నారు.
Tags:    

Similar News