గుంటూరు జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్ ను మంత్రి రావెల కిశోర్ వేధించిన ఘటన పార్టీలకు అతీతంగా అందరు నేతలనూ బాధించింది. ఒక ప్రజాప్రతినిధికే మహిళగా రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న వేస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీలో జరిగిందే అయినా.. వైసీపీ నేతలు కూడా జానీమూన్ పట్ల సానుభూతి చూపుతున్నారు.
ఏపీలో మహిళలపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆవేదన చెందారు. గుంటూరు టీడీపీ జెడ్పీ చైర్ పర్సన్ జానీమూనే మీడియా ముందుకు వచ్చి వాపోయారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీలో ఉన్న మహిళా నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతల్లో నిజంగా అమ్మతనం ఉంటే వెంటనే మంత్రి రావెల కిషోర్ బాబును కేబినెట్ నుంచి భర్తరప్ చేయాల్సిందిగా చంద్రబాబును కోరాలని డిమాండ్ చేశారు. కేబినెట్ నిండా రావణాసురులు, సైకో సూదిగాళ్లు ఉన్నట్టుగా ఉందన్నారు. అచ్చొచ్చిన ఆంబోతుల్లా రాష్ట్రం మీదకు మంత్రులను చంద్రబాబు వదిలేశారని ఫైర్ అయ్యారు. ఆడవాళ్ల మాన, ప్రాణాలతో చంద్రబాబునాయుడు - ఆయన మంత్రులు చెలగాటం ఆడుతున్నారని.. అయినా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
టీడీపీ అనేది.. తెలుగుదేశం పార్టీనా లేక దొంగల పార్టీనా.. దుర్యోధనుల పార్టీనా అని ప్రశ్నించారు. మంత్రి రావెల కిశోర్బాబుతో తనకు ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తంచేసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక మాచర్ల టీడీపీ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ పురుగుల మందు తాగి చనిపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/