ఆ టీడీపీ ఎంపీలిద్ద‌రు సారా, బ్యాంకు దొంగ‌లా

Update: 2016-09-16 11:30 GMT
వైకాపా ఫైర్ బ్రాండ్‌ - న‌గ‌రి ఎమ్మెల్యే రోజా మ‌రోసారి సీఎం చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌ లో ఫైరైపోయారు. టీడీపీ ఎంపీల‌ను టార్గెట్ చేసిన రోజా.. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబును కూడా ఉతికి ఆరేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె అధికార ప‌క్షంపై నిప్పులు కురిపించారు. ఇప్ప‌టికే  త‌న నోటి దురుసుతో చంద్ర‌బాబుపై అసెంబ్లీలో ఆరోప‌ణ‌లు చేసిన రోజా.. దాదాపు ఏడాది పాటు స‌స్పెన్ష‌న్‌ కు గుర‌య్యారు. ఆ త‌ర్వాత కోర్టుల చుట్టూ తిరిగి.. నానా తిప్ప‌లు ప‌డ్డారు. ఇంకా దీనిపై స్పీక‌ర్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయినా.. కూడా రోజా చంద్ర‌బాబుపై త‌న స్పీడ్‌ ను త‌గ్గించ‌డం లేదు. అంతేకాదు, తాజాగా ఆమె టీడీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి - టీజీ వెంక‌టేశ్‌ ల‌పై అదిరిపోయే కామెంట్ల‌తో విరుచుకుప‌డ్డారు.

సాధార‌ణంగా రోజా ఎప్పుడు మాట్లాడినా.. టీడీపీ ఎమ్మెల్యేలు - మంత్రుల‌పైనే ఓ రేంజ్‌ లో కామెంట్లు కుమ్మేస్తారు. తాజాగా ఆమె ఎంపీల‌పై చేసిన ఆరోప‌ణ‌లు మాత్రం పొలిటిక‌ల్‌ గా తీవ్ర వివాదం సృష్టించేలా ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని తిరుప‌తి సాక్షిగా పేద్ద బ‌హిరంగ స‌భ‌లో వెల్ల‌డించిన బాబు ఏపీ ప్ర‌జ‌ల అభివృద్ధిని - గౌర‌వాన్ని కేంద్రంలో తాక‌ట్టు పెట్టేశార‌ని అన్నారు. తాను నిప్పున‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు ప‌దేప‌దే త‌ప్పు చేస్తుంటార‌ని విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టికి 18 కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నార‌ని విమ‌ర్శించారు. రాజధానిని సింగపూర్ కు అమ్మేసే కుట్ర జరుగుతోందని రోజా అన్నారు.

ఇదిగో రాజధాని అంటూ బొమ్మలు చూపి అమరావతిని భ్రమరావతిగా మార్చేసిన ఘనత ఆయనదేనన్నారు. ఇక‌, టీజీ - సుజ‌నాల గురించి ప్ర‌త్య‌క్షంగా పేర్లు పెట్టి విమ‌ర్శించ‌క‌పోయినా.. ఇద్ద‌రి గురించి ఘాటు విమ‌ర్శ‌లే చేశారు రోజా. ఒక‌రు బ్యాంకుల దొంగ అని - వేల కోట్ల‌లో విదేశీ బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టార‌ని అన్నారు. మ‌రొక‌రు సారా దొంగ అని దుయ్య‌బ‌ట్టారు. మొత్తానికి రోజా కామెంట్లు పొలిటిక‌ల్‌ గా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించేవే. ఏదేమైనా.. ఏడాది స‌స్పెన్ష‌న్ వేటును ఎదుర్కొంటూ కూడా రోజా కామెంట్ల విష‌యంలో కంట్రోల్ కాలేక‌పోతున్నార‌ని కొంద‌రు అంటుండ‌డం గ‌మ‌నార్హం.ఇక‌, రోజా తాజా కామెంట్ల‌పై టీడీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News