వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. శాసనసభలోకి అనుమతించకపోవడంతో ఆమె గాంధీ విగ్రహం ముందు నేలపై పడుకొని ఆందోళన చేపట్టారు. తనకు కోర్టులో న్యాయం జరిగినా సభలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
శనివారం సమావేశాలు ప్రారంభం కాగా సభకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను మార్షల్సు గేటు వద్ద అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాలు లేవని, స్పీకర్ ఆదేశిస్తే లోపలికి పంపిస్తామని మార్షల్సు తెలిపారు. సభలోకి రోజాను అనుమతించాలంటూ వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోజా విషయంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా ఏపీ శాసన సభ సమావేశాలకు ప్రతిపక్ష నేత జగన్ నల్ల దుస్తులతో హాజరయ్యారు. రోజా సభలోకి అనుమతించకపోవడంతో నిరసనగా వైకాపా ఎమ్మెల్యేలు నల్ల దుస్తులతో సభకు హాజరయ్యారు. స్పీకర్ పొడియం చుట్టు ముట్టి ఆందోళన చేస్తున్నారు. రోజాను సభకు అనుమతించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు.
కాగా అసెంబ్లీ బయట ఫుట్ పాత్ పై రోజా ఓ క్లాత్ పరిచి అక్కడే పడుకుని నిరసన తెలుపుతున్నారు. మరోవైపు ఉదయం ఆమె టిఫిన్ తినకపోవడంతో నీరసించిపోయారు. వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆమె వెంట ఉన్నారు. మిగతా వైసీపీ ఎమ్మెల్యేలంతా సభలో ఆందోళన చేస్తున్నారు. నీరసించినా కూడా దీక్ష విరమించే ప్రసక్తే లేదని రోజా పట్టుదలగా ఉన్నారు.