జనసేన పార్టీ అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటు ప్రశ్న సంధించారు. పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని నిలదీశారు. వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ప్లీనరీలో పాల్గొన్న సందర్భంగా రోజా మాట్లాడుతూ కాపులను సీఎం చంద్రబాబు మోసం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
‘ప్రజల కోసం ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ రావడం సంతోషమే. కానీ అలా ప్రశ్నిస్తానన్న మొనగాడు ఎక్కడికి వెళ్లాడు. కాపులకు రిజర్వేషన్ పై స్పందనే లేదు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ ని చెప్పుకున్నావ్ కదా పవన్. అలాంటి పెద్ద మనిషివి జీఎస్టీ భారం గురించి ఎందుకు నోరు మెదపడం లేదు. లబ్బర్ సింగో - గబ్బర్ సింగో తేల్చుకోవాలి. ప్రజల శ్రేయస్సే ముఖ్యమనుకుంటే ప్రభుత్వాలను నిలదీయాలి’ అని రోజా అన్నారు. ఏపీలోని గిరిజనుల అనారోగ్యంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తీరును ఈ సందర్భంగా రోజా ఎద్దేవా చేశారు. మంత్రి కామినేనిని చూస్తుంటే...ఆయన టీడీపీ ఎమ్మెల్యేనో - బీజేపీ ఎమ్మెల్యేనో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కొండలు ఎక్కుతారు కానీ గిరిజనులకు నీళ్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రజలు ఛీత్కరించినా దొడ్డిదారిన మంత్రి అయిన యనమలకు తమపై విమర్శలు చేయడం చిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/