ఏపీ విపక్ష ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోసారి గళం విప్పారు. తూటాల్లాంటి మాటలతో రాజకీయ ప్రత్యర్థులపై ఆమె చేసే వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. తాజాగా విశాఖలో నిర్వహిస్తున్న మహానాడుపైనా.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా.. పార్టీ నేతలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ మహానాడు వెన్నుపోటు మహానాడుగా మారిందన్న రోజా.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి మానసిక క్షోభకు గురయ్యారో చర్చించి ఉంటే బాగుండదేన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని.. పెద్దాయనకు భారత రత్న ఇప్పించటంలో టీడీపీ కృషి చేయలేదన్న ఆరోపణ చేశారు. చంద్రబాబు పాలన మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి రోజా.. ఏ ఒక్క పథకాన్ని బాబు సరిగా అమలు చేయలేదన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన నేతలకు సిగ్గులేకుండా మంత్రి పదవులు ఇచ్చారన్న ఆమె.. మహానాడులో చేసిన తీర్మానాల్లో ఏ ఒక్కటి అమలు కావటం లేదన్నారు.
అవినీతి రహిత పాలనను అందిస్తున్నట్లుగా చెబుతున్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధాలుగా అభివరనించారు. అవినీతిలో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని ఎన్‌సీఈఆర్పీ సర్వే తేల్చిందన్న రోజా.. ఐదు నెలల వ్యవధిలో లోకేశ్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయో చెప్పాలన్నారు. ఓట్ల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన బాబు.. ఇప్పటివరకూ రాజధాని అంశంపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. హత్యల్ని అడ్డుకోవటంలో ఏపీ సర్కారు విఫలమైందన్న రోజా.. హత్యారాజకీయాలకు తెర తీయటాన్ని తప్పు పట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/