రాఖీ పండగ రోజున వైసీపీ అధినేత జగన్ కు గట్టి అండ దొరికింది. నేనుండగా జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరంటూ ఆ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లేడీ ఎమ్మెల్యే రోజా ప్రకటించారు. రక్షా బంధన్ ను పురస్కరించుకుని హైదరాబాదులోని జగన్ నివాసానికి తన కుమార్తెతో కలిసి వెళ్లిన రోజా ఆయన చేతికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా జగన్ - ఆయన కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న రోజా జగన్ ను తన సొంత అన్నగా భావిస్తూ తానుండగా ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె గత ఏడాది జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. టీడీపీ సర్కారు కుట్ర పన్ని అసెంబ్లీ నుంచి తనను ఏడాది పాటు బహిష్కరించిన సందర్భంగా జగన్ తనకు అండగా నిలిచారని చెప్పారు. అప్పటి నుంచి జగన్ ను తన సొంత అన్న కంటే ఎక్కువగా భావిస్తున్నానని తెలిపారు. తనతో జగన్ కలిసి ఉన్నంత కాలం ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని కూడా రోజా చెప్పడంతో అక్కడున్న వైసీపీ నేతలంతా హర్షం వ్యక్తం చేశారు.
కాగా గత ఏడాది అసెంబ్లీలో ప్రభుత్వ విధానాలను నిరసించే క్రమంలో రోజా దూకుడు ప్రదర్శించగా ఆమెను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. దానిపై రోజా కోర్టులో న్యాయపోరాటం చేయగా జగన్ అసెంబ్లీలో ఆమె తరఫున తన వాణిని వినిపించారు. అనంతరం అది సద్దమణగగా జగన్ పార్టీలో రోజా ప్రాముఖ్యం మరింత పెరుగుతూ వచ్చింది. సీనియర్ లీడర్ల కంటే జగన్ రోజాకు ఎక్కువ ప్రాధాన్యమే ఇస్తూ వస్తున్నారు. రోజమ్మ అంటూ అభిమానంగా పిలిచే జగన్ కు తాను అండగా నిలుస్తానని ఇప్పుడు రాఖీ పండగ సందర్భంగా రోజా ప్రకటించడంతో కొద్దికాలంగా ఆమె పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారానికి తెర పడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరని రోజా అనడంతో అక్కడున్న నేతలు కొందరు ఇక జగన్ కు ఏ భయం లేదంటూ సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.