విశాఖ భూకుంభకోణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేల పాత్ర ..

Update: 2019-11-02 06:31 GMT
ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలతో ముందకుసాగుతున్న విషయం  తెలిసిందే. రివర్స్ టెండరింగ్ అంటూ సంచలనానికి తేర తీసిన వైసీపీ .. గత ప్రభుత్వ హయం లో విశాఖ భూ కుంభకోణం పై సిట్ వేసి మరో సంచలనానికి తేర తీసింది. విశాఖ భూముల కుంభకోణంపై విచారణలో కీలక ఘట్టానికి శుక్రవారం తెరలేచింది. భూకుంభకోణాలు, రికార్డుల తారుమారు మీద వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాపు కమిటీ  దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి రోజు 19 కౌంటర్ల ద్వారా 79 వినతులను స్వీకరించింది. ఇందులో సిట్‌కు 14, నాన్‌ సిట్‌కు 65 ఫిర్యాదులందాయి.అలాగే  ఈ నెల 7వ తేదీ వరకు దరఖాస్తులను సిట్ అధికారులు స్వీకరించనున్నారు.

వైసీపీ ఏర్పాటు చేసిన ఈ సిట్ లో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్, మరో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వైవీ అనురాధ, విశ్రాంత న్యాయమూర్తి టి.భాస్కరరావులు సభ్యులుగా ఉన్నారు. విశాఖపట్నం రెవెన్యూ డివిజన్‌లో ఉన్న పలు మండలాల పరిధిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూ అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి బలం చేకూర్చుతూ   తెలుగుదేశం నేతలు, ప్రజాప్రతినిధులపై బాధితులు ఫిర్యాదులు చేశారు. తొలిరోజు వచ్చిన  79 దరఖాస్తుల్లో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులుండటం విశేషం.

తెలుగుదేశం నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ, అతని అనుచరులు రెవెన్యూ అధికారుల సహకారంతో తమ స్థలాన్ని ఆక్రమించారని పిళ్లా పాపయ్య పాత్రుడు ఆరోపించారు. తహసీల్దార్‌ లలో కలిసి భూములు కాజేశారని ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుండో మా    ఆధీనంలో ఉన్న భూములని లాక్కున్నారని , తమ కుటుంబ సభ్యుల పేర్లు మార్పు వెనుక రెవెన్యూ అధికారులు పాత్ర ఉందన్నారు. అలాగే పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పై కూడా మరొకరు ఫిర్యాదు చేసారు.  బండారు సత్యనారాయణమూర్తి,  తెలుగుదేశం నాయకులు తమ భూములు తమకి దక్కకుండా  అడ్డుతగిలారని పరవాడ మండలం ఈదులపాక బోనంగికి చెందిన జంగాల రమేష్‌ ఆరోపించారు. వీరితో పాటుగా చాలామంది రైతులు తమ భూములని అధికారులు అక్రమంగా లాక్కున్నారని , తిరిగి తమ భూములని ఇప్పించాలని సిట్ ని కోరారు.
Tags:    

Similar News