అంబానీ గ్యారేజీలో రోల్స్ రాయిస్.. ధరెంతంటే?

Update: 2022-02-05 05:31 GMT
భారత్ లో ఉండే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొత్త కారు కొన్నారు. కారు విలువ సుమారు 13.14కోట్లు గా ఉంది. ఇది దేశంలోనే అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా పేరుగాంచింది. దీనిని ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ రూపొందించింది. ఇది హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు. దీనిని ముంబయిలోని ఓ ఆర్టీఐ కార్యాలయంలో రిజిస్టర్ చేయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన ఈ కారు విలువ తొలినాళ్లలో కేవలం రూ. 6.95కోట్లు మాత్రమే ఉండేది. అయితే క్రమక్రమంగా దీని విలువ భారీగా పెరిగింది. అంతేగాకుండా కొన్న తరువాత దీనిని అంబానీకి ఇష్టం వచ్చిన విధంగా కారులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీని కోసం రిలయన్స్ అధినేత సాధారణ ధర కంటే మరో రూ. 3 కోట్లు ఎక్కువ వెచ్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలాంటి కార్లు మనం దేశంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నాయి. సాధారణంగా ఇలాంటి ఖరీదైన కార్లను కేవలం ప్రముఖులు మాత్రమే ఉపయోగిస్తారు. గతంలో కూడా  ముఖేష్ అంబానీ ఇలాంటి లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు. వాటి ధర కూడా కోట్ల రూపాయల్లో ఉందని అధికారులు పేర్కొన్నారు.
 
ముఖేష్ అంబానీ కొనుగోలు చేసిన కొత్త రోల్స్ రాయిస్ కారు తార్డియో ఆర్టీఐ కింద నమోదు చేయించారు. అయితే ఈ కారుకు ప్రత్యకే నంబర్ ప్లేట్ ను కూడా కొనుగోలు చేశారు. ఆ ఫ్యాన్సీ నెంబర్ కొనుగోలుకు అంబానీ సుమారు రూ. 12 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈ కారు నంబర్ కూడా అంబానీకి ఇష్టం అయిన 0001 గా తీసుకున్నారు.
 
ముఖేష్ కొనుగోలు చేసిన కారు.. సుమారు 2.5 టన్నుల బరువు ఉంటుంది. దీనిలో 12 సిలిండర్లు వరకు ఉంటాయి. ఇవి కారు కు మరింత వేగాన్ని అందించేందుకు సహాయపడుతాయి. ఈ రోల్స్ రాయిస్ కారు బీ.హెచ్.పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.  ఈ కారు టస్కన్ సన్ రంగులో ఉంటుంది. ఈ కారుకు చేయించిన రిజిస్ట్రేషన్ మరో 15 ఏళ్లు వరకు ఉంటుంది. దీనికి వన్ టైం రిజిస్ట్రేషన్ కింద సుమారు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. అంతేగాకుండా రోడ్ ట్యాక్స్ కింద మరో రూ. 40 వేలు చెల్లించారు.
Tags:    

Similar News