మనిషికి తిండి తర్వాత ఇంకేమైనా అవసరం ఉందా? అంటే రొమాన్స్ అనే చెప్పాలి. నోరు లేని జంతువుల నుంచి నోరున్న మనిషి వరకూ సృష్టి ధర్మంగా చెప్పే శృంగారం కూడా లైట్ అనేస్తున్నారు డిజిటల్ యుగపు మనిషి. రోజులు గడిచే కొద్దీ టెక్నాలజీ వైపు పరుగులు తీస్తున్న ప్రపంచానికి తగ్గట్లే మనిషి ఆలోచనలు.. ప్రాధాన్యతలు ఎంతలా మారిపోతున్నాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఇంటర్నెట్ వినియోగదారులపై ఒక ఆసక్తికర సర్వే ఒకటి నిర్వహించారు. దీనికి తగ్గట్లే ఆ సర్వే ఫలితాలు అంతకంటే ఆసక్తికరంగా రావటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఐపాన్ అనే గ్లోబల్ మీడియా కనెక్టివిటీ సంస్థ 1700 మందిపై ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో 40 శాతం మంది తమ రోజువారి అవసరాల్లో వైఫై అతి ముఖ్యమైనదిగా పేర్కొనటం గమనార్హం. జీవితంలో ముఖ్యమైనది ఏమిటన్న ప్రశ్నకు అత్యధికులు (40శాతం) వైఫై అని తేల్చేస్తే.. 37 శాతం మంది శృంగారానికి ఓటేశారు. ఇక.. 14 శాతం మంది చాక్లెట్లకు.. 9 మంది అల్కాహాల్ తమ ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు.
వైఫై తమ జీవితాన్ని మెరుగుపర్చిందన్నఅభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న 75శాతం మంది చెప్పటం విశేషంగా చెప్పాలి. ఎక్కువ వేగం.. తక్కువ ధర.. ఎక్కడైనా అందుబాటులో ఉండేలా వైఫై ఉండాలని తమ కలల ప్రపంచాన్ని ఆవిష్కరించారు. అయితే.. ఈ సర్వే ఫలితం మన దగ్గర కాదు. ఉత్తర అమెరికాకు చెందిన వారు కొందరు.. యూరప్ కి చెందిన వారిని సర్వే చేసినప్పుడు ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడిప్పుడే సామాన్యుడు సైతం ఇంటర్నెట్ రుచిని చూస్తున్ననేపథ్యంలో.. మరో రెండు..మూడేళ్లు ఆగితే మన దగ్గర కూడా ఇలాంటి ఫలితం వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. కొత్త ‘కిక్’ ఇచ్చే ఇంటర్నెట్ ఎవరినైనా తన మాయాజాలంలో పడేసుకోవటం ఖాయం. ఆ మాయలాడి వలలో చిక్కుకున్నప్పుడు సహజసిద్ధమైన శృంగారం మీద మోజు తగ్గటాన్ని అర్థం చేసుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/