ఒకే అంశం చాలామందికి చాలా రకాలుగా అర్థమవుతూ ఉంటుంది. చూసే కోణాన్ని అనుసరించి.. సదరు వ్యక్తి తీరుకు తగ్గట్లుగా విషయం ఉంటుంది. తన పుస్తకంతో ఆర్యవైశ్యుల్లో మంట పుట్టించిన కంచె ఐలయ్యపై తాజాగా సీనియర్ రాజకీయ నాయకుడు.. తమిళనాడు గవర్నర్.. ఆర్యవైశ్యులకు బ్రాండ్ అంబాసిడర్ అయిన కొణిజేటి రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐలయ్య పుస్తకంపై ఆర్యవైశ్యులంతా భగ్గుమంటూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. పెద్దాయన మాత్రం ఈ ఎపిసోడ్ లో కొత్త కోణాన్ని బయటకు తీశారు. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రోశయ్య.. ఐలయ్య పుస్తకం వైశ్యుల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందన్నారు.
వైశ్యుల్ని కించపరిచేలా ఐలయ్య పుస్తకాన్ని రాశారన్న రోశయ్య.. ఆయన వ్యాఖ్యలతో ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెరిగిందన్నారు. ఈ కారణంతోనే ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో వైశ్యులు ఆందోళనలు చేస్తున్నారన్నారు.
ఐలయ్య తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటే హుందాగా ఉంటుందన్నారు. ఒకవైపు తిట్టిన తిట్టు తిట్టకుండా ఐలయ్య తిట్టేస్తుంటే.. ఆయన తిట్లకు సరైన రీతిలో సమాధానం చెప్పాల్సింది పోయి.. ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెరిగిందంటూ సంతోషపడితే సరిపోతుందా? అన్నది ఒక ప్రశ్న. వైశ్యులపై తాజాగా ఐలయ్య చేసిన ఘాటు వ్యాఖ్యలు రోశయ్య దృష్టికి వచ్చాయో లేదో కానీ.. ఇప్పటికీ ఐలయ్య తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలంటూ చెబుతున్న తీరు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే.. పుస్తకంతో తన వైఖరిని స్పష్టం చేసిన ఐలయ్య.. అంతకు మించి అన్నట్లుగా తరచూ చేస్తున్న వాదనల నేపథ్యంలో రోశయ్య పుస్తకంలో చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలనటంలో అర్థం లేదు. పుస్తకానికి మించిన వ్యాఖ్యల్ని ఇప్పుడు నిత్యం చేస్తున్న ఐలయ్య వ్యాఖ్యలపై రోశయ్య మరింతగా స్పందించాల్సిన అవసరం ఉందని వైశ్యులు కోరుకుంటున్నారు. మరి.. వారి ఆశల్ని.. ఆకాంక్షల్ని రోశయ్య అందుకుంటారో..లేదో?