ఒక యువతిపై మూడు రోజులుగా అత్యాచారం చేస్తున్న ఒక రౌడీషీటర్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఉదంతం చూస్తే.. సదరు రౌడీ షీటర్ తీరు ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం కాక మానదు. ఓవైపు ఘోరమైన తప్పు చేస్తూనే.. మరోవైపు పోలీసులకు సైతం తన తీరుతో షాకిచ్చిన ఈ వైనం వింటే షాక్ తినాల్సిందే.
సికింద్రాబాద్ పరిధిలోని వారాసి గూడ అంబర్ పేటకు చెందిన 26 ఏళ్ల షేక్ అమీర్ కు పెళ్లై.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన ఇంటికి దగ్గర్లో ఉండే ఒక యువతి ఇంట్లోకి చొరబడి గడిచిన మూడు రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గడిచిన మూడు రోజులుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అతగాడి తీరును ప్రశ్నించిన బాధితురాలి తల్లిపై భౌతికదాడికి పాల్పడ్డాడు.
అమీర్ ఆగడాలతో భయంతో ఉండిపోయిన బాధితురాలికి స్థానికులు ఇచ్చిన చేయూతతో బయటకు వచ్చి తాజాగా డీసీపీకి కంప్లైంట్ చేశారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. తనపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్న సమాచారం తెలుసుకున్న అమీర్ ఫుల్ గా తాగేసి.. పోలీస్ స్టేషన్ ఎదుట హల్ చల్ చేశాడు. ఒక చేత్తో మందుబాటిల్.. మరోచేత్తో బ్లేడ్ పట్టుకొని గోపాలపురం పోలీస్ స్టేషన్ ఎదుట అతగాడు సృష్టించిన హడావుడితో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తనను అరెస్ట్ చేస్తే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని బెదిరించసాగాడు. ఇతగాడి హడావుడితో ఏం చేయాలో పాలుపోని పోలీసులు కాసేపు తర్జన భర్జన పడ్డారు. స్టేషన్ ఎదుట అతగాడి హంగామా నేపథ్యంలో కాసేపటికి అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతడ్ని రిమాండ్కు తరలించారు.