టీవీ లైవ్ షోలలో జరుగుతున్న అద్భుతాలకు కొదవలేదు. లైవ్ షో డిబేట్లలో పాల్గొని రెచ్చిపోయి కామెంట్లు చేసుకున్నవాళ్లు ఉన్నారు. మరింకా రెచ్చిపోయి ఒకరినొకరు తన్నుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి తన్నుకోవడాలు - తిట్టుకోవడాలు కాకుండా.. ఏకంగా పోలీసులే రంగ ప్రవేశం చేసిన ఘటన జరిగింది. లైవ్ షో జరుగుతున్న టీవీ స్టూడియోకి నేరుగా వచ్చిన పోలీసులు.. సదరు నిందితుణ్ని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశారు. వివరాలేంటో చూద్దాం.. మహేశ్ అలియాస్ డాకూరి (డెక్కల) బాబు! ఇతను ఇటీవల కాలంలో తెలంగాణ పోలీసులకు కంట్లో నలుసులా మారాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ.. బెదిరింపులకు - హత్యలకు కూడా తెగబడుతున్నాడు.
ఇటీవల కాలంలో ఇలాంటి వాటిని అణిచేయాలని సీఎం కేసీఆర్ నుంచి గట్టి ఆదేశాలు అందడంతో వారం కిందట గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు అంతం చేసిన విషయం తెలిసిందే. అయితే, నయీం రేంజ్ లో కాకపోయినా.. తన స్థాయికి తను ఇలాంటివే చేస్తున్న డెక్కలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. డెక్కల పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్ వివాదంలో శివరాజ్ యాదవ్ ను హత్య చేసి - ఆపై కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపి పోలీసులకు చిక్కకుండా చిక్కడు దొరకడు రేంజ్ లో పోలీసులతో ఆడుకుంటున్నాడు డాకూర్ బాబు. అయితే, మనోడికి మీడియా ముందుకు రావడం అంటే భలే మజా! అందునా.. లైవ్ షో అంటే మరీ క్రేజ్!!
ఈ క్రమంలోనే మంగళవారం టీవీ 9 స్టూడియోకు వచ్చి - లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాడు. యూపీలో తుపాకులు చాలా సులువుగా దొరుకుతాయని - తాను అక్కడి నుంచే తుపాకులు తెచ్చానని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని, యాదగిరిని చంపాలన్న ఉద్దేశం లేదని, బెదిరించాలనే అలా చేశానని చెప్పుకొచ్చాడు. తనకు నేర చరిత్ర లేదని ఇలా తన మనసులో మాటల్ని మీడియా స్టూడియోలో పాఠంలాగా వల్లించేశాడు. మరి పోలీసులు ఊరుకుంటారా? తమ పనితాము చేసేశారు.
డాకూర్ బాబు స్టూడియోలో ఉన్నాడని తెలియడం ఆలస్యం అలెర్టయిన పోలీసులు టీవీ -9 స్టూడియోను చుట్టుముట్టి డాకూరిని అరెస్టు చేసేశారు. దీంతో డాకూరి లైవ్ షో ముగిసినట్టేనని అధికారులు చెప్పారు. అయితే, లైవ్ షోకి వస్తే ఇలా జరిగిందేంటని డాకూరి లబోదిబోమన్నాడు. ఇంతలో షోకి కట్ చెప్పేశారు ప్రజంటేటర్! ఇదీ కథ!! తప్పు చేసి లైవ్ షోలో కూర్చుంటే ఎవరూ ఏం చేయరు అనుకునేవారికి ఇదో గుణపాఠం.