కరోనాకి మూలకారణం ... బిల్ గేట్స్ : అసలు విషయమేంటే ?

Update: 2020-04-16 10:55 GMT
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 21లక్షల మంది కరోనా వైరస్ భారిన పడగా, ఈ వైరస్ రోజురోజుకి మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం నాటికి 1.35లక్షల మందిని బలితీసుకుంది. అయితే , దీన్ని అరికట్టడానికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రస్తుతానికి లాక్ డౌన్ విధించారు . అయితే , లాక్ డౌన్ ను ప్రజలు అంతగా పాటించడం లేదు. అలాగే ఇప్పట్లో కరోనా కి వ్యాక్సిన్ కూడా రెడీ అయ్యేలా లేదు. ఇకపోతే , మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..కరోనా పుట్టినప్పటి నుంచీ దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. సామాన్యుల నుండి ప్రపంచ దేశాల అధినేతలు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ రాజకీయ సలహదారుడు రోజర్ స్టోన్ ..ఈ వైరస్ పుట్టుక గురించి సరికొత్త అనుమానాలను లేవనెత్తారు. వైరస్ పుట్టుక వెనుక కుట్ర కోణం దాగి ఉందని అన్నారు. కరోనా వైరస్ పుట్టుకుని రావడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రధాన కారణమని , ఆయనతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కొందరు మేధావుల హస్తం ఉందని అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మీరు నమ్మినా, నమ్మకపోయినా, నేను చెప్పేదానిపై కచ్చితంగా చర్చించండి. నా దాకా వస్తే, నా శవానికి కూడా వ్యాక్సిన్ వద్దంటాను. ‘కంపల్సరీ వ్యాక్సినేషన్' ఎంత పెద్ద కుట్రో అందరికీ తెలుసు. ఈ భూమ్మీదున్న మనుషులందరికీ తప్పనిసరిగా టీకాలు వేయించాలని కొందరు గ్లోబలిస్టులు ప్రయత్నిస్తున్నారు. వాళ్లలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా ఉన్నాడు. నిజానికి కరోనా వైరస్ ను సృష్టించింది ఆయనే. వైరస్ పేరుతో అందరికీ వ్యాక్సినేషన్ చేసి, దానికి గుర్తుగా ఒంట్లో మైక్రోచిప్ పెడతారు. కాబట్టి వాళ్ల కుట్రల్ని అడ్డుకుందాం అని రోజస్ స్టోన్ ఆరోపించారు

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పై ట్రంప్ మనిషి రోజర్ స్టోన్స్ చేసిన కామెంట్లపై దుమారం కొనసాగుతుండగానే, కరోనాకు సంబంధించి కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలకూ విస్తరించినా, ఒక్కోచోట ఒక్కోలా ప్రభావం చూపుతోంది. క్షయ వ్యాధికి విరుగుడుగా వాడే ‘బీసీజీ వ్యాక్సిన్'ను తప్పనిసరి చేసిన దేశాల్లో కొవిడ్-19 తీవ్రత తక్కువగా ఉందని, బీసీజీ వ్యాక్సినేషన్‌ను సార్వత్రికంగా అమలు చేయని అమెరికా, ఇటలీ, నెదర్లాండ్‌ లాంటి దేశాల్లో తీవ్రంగా ఉందని సాక్ష్యాత్తూ అమెరికా అధ్యయన సంస్థలే తేల్చాయి. ఇకపోతే ఈ కరోనా కు వ్యాక్సిన్ ను రెడీ చేయడానికి ప్రస్తుతం అన్ని దేశాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ల రీసెర్చ్ కోసం బిల్ గేట్స్ ఏకంగా 45 బిలియన్ డాలర్లు విరాళం కూడా ఇచ్చారు. అదీగాక, WHOకు నిధులు నిలిపేసిన విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ తీరును బిల్ గేట్స్ తీవ్రంగా తప్పుపట్టారు. అలాగే , తాజాగా బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ కు భారీ విరాళం అందజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున 150 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.
Tags:    

Similar News