ఔనా? బొత్స కామెంట్ల వెనుక ఇంత ప్లాన్ ఉందా? ఎంపీ ర‌ఘురామ చెప్పిన నిజం!

Update: 2021-08-31 02:30 GMT
ఏపీ మంత్రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత‌.. బొత్స స‌త్యానారాయ‌ణ ఇటీవ‌ల‌.. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి.. వివాదాస్ప‌ద‌మ‌య్యారు. రాజ‌ధాని రైతుల‌తో తిట్లు  తిన్నారు. అయితే.. బొత్స ఇలా రాజ‌ధానిపై వ్యాఖ్య‌లు చేయ‌డం కామ‌న్‌గా జ‌రిగేదేనా?  లేక దీనికి ఏదైనా విశేషం ఉందా? అంటే.. విశేషం ఉంద‌నే అంటున్నారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. తాజాగా ర‌ఘురామ మీడియాతో మాట్లాడుతూ.. బొత్స రాజ‌ధాని కామెంట్ల గుట్టును బ‌య‌ట పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు లేదా డిల్లీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన స‌మ‌యంలో ఏపీలో రాజ‌కీయ వాతావరణాన్ని వేడెక్కించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్ర‌య‌త్నిస్తార‌ని ర‌ఘురామ పేర్కొన్నారు.

వ్యూహం ప్ర‌కార‌మే..

దీనివెనుక వ్యూహం ఉంద‌ని.. ర‌ఘురామ చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న నుంచి ప్ర‌జ‌లు, రాజ‌కీయ నేత‌ల దృష్టిని మ‌ళ్లించేం దుకు బొత్స ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇలాంటి కామెంట్లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గతంలో అమరావతిపై చిచ్చురాజేసింది కూడా బొత్స సత్యనారాయ‌ణేన‌ని.. సీఎం సిమ్లా పర్యటనలో ఉన్నప్పుడే మంత్రి బొత్స మరోసారి రాజధానిపై వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలు చేశారన్నారు. మంత్రుల వ్యాఖ్యలతో కోర్టులంటే ఎంత దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయో అర్ధమవుతోందన్నారు. ``అమరావతిని 29 గ్రామాల రాజధాని అని మాట్లాడటం ఏంటి.. చట్ట పరిధిలో ఉన్న అంశాలపై ఇలా ఎందుకు మాట్లాడతా``రని ప్రశ్నించారు.

మ‌తిలేని ప్ర‌క‌ట‌న‌

బొత్స సీనియర్ నేత అమరావతి రైతులుతో ఎందుకు ఇలా అనిపించుకుంటున్నారన్నారు ఎంపీ. అంతమంది రైతులు 33వేల ఎకరాలు ఇస్తే ఇప్పుడు దుకాణం సర్థేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా మూడు రాజధానులు అంటారా.. రాజధాని అంటే ఏమిటి.. మూడు రాజధానులు అనేది మతిలేని స్టేట్మెంట్ అంటూ ఘాటు వ్యాఖ్యల చేశారు. ``కర్నూలులో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారట.. శ్రీకాకుళంలో ఎవరికైనా అన్యాయం జరిగితే కర్నూలు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యం లేదు. కర్నూలులో హైకోర్టు ఉంటే.. విశాఖ నుంచి పని మీద వెళ్లేవాళ్లు ఎలా వెళ్లాలి`` అని ప్ర‌శ్నించారు. న్నారు.

అది చిన్న‌త‌ప్పే!

కేంద్రం విశాఖను రాజధానిగా పేర్కొందంటూ హడావిడి చేశారని రఘురామ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడుగుతుంటారని.. చిన్న చిన్న తప్పులు దొర్లుతుంటాయన్నారు. అందుకే ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో క్లారిటీ ఇచ్చింది.. దీనిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. అమరావతి అంటే 29 గ్రామాల సమూహం, కోర్ కేపిటల్ కావాలంటే తర్వాత చర్చ పెట్టుకుందామని.. అమరావతి పేరుతో అనవసరమైన చర్చ, రాద్దాంతం వద్దన్నారు.

స‌ర్వేకు ఆధారం ఉంది!

ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్‌కు రఘురామ కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ రాజీనామా గొడవేంటని ప్రశ్నించారు. ఎవరి పనిలో వారున్నారు.. తన సర్వేలో 50మంది మాత్రమే నెగ్గుతారని తేలిందన్నారు. తన సర్వేకు సంబంధించి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయన్నారు. సర్వేలు తనకు తెలుసని.. విజయసాయిరెడ్డి దగ్గర సర్వేలు కూడా తనకు తెలుసన్నారు. అపహస్యం పాలయ్యేది ఆయనే.. తన బొమ్మతో తాను నెగ్గాను అన్నారు. మహా అంటే తనను పార్టీ నుంచి బహిష్కరించగలరని.. తాను ప్రేమించే పార్టీ నుంచి పంపించగలన్నారు.. దమ్ముంటే చేసుకోవాలన్నారు.  మళ్లీ టికెట్ వస్తుందో లేదో అన్నారు. తాను కష్టమైన సీట్లో గెలిచానని.. యాంటీ వేవ్ మలచుకుని వచ్చానన్నారు. విజయసాయిలా దొడ్డిదారిన ఎంపీ కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంలో ఒక ఆర్థిక మంత్రి, ఢిల్లీలో మరో ఆర్థిక మంత్రి ఉండవలసిన పరిస్ధితులు ఏర్పడ్డాయన్నారు.
Tags:    

Similar News