న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో తనపై అనాగరికమైన పరుష పదజాలం ఉపయోగించారని, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఓ ఎమ్మెల్యే, ఆ ఛానల్ జర్నలిస్ట్ పై పరువునష్టం దావా వేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే... ఈ నోటీసుల్లో వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, అలా కాని పక్షంలో రూ. 100కోట్ల పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు!!
వివరాళ్లోకి వస్తే... ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి పై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అహ్వాద్ పరువు నష్టం దావా వేశారు. అర్నాబ్ తో పాటు "టైమ్స్ నౌ" కూ ఆయన నోటీసులు పంపించారు. ఆ ఛానల్లో ప్రసారమయ్యే "న్యూ అవర్" చర్చా కార్యక్రమంలో తనపై పరుష పదజాలం ఉపయోగించారని, తద్వారా తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆయన న్యాయవాది ప్రశాంత్ కే కదం ద్వారా నోటీసులు పంపించారు. కాగా ఈ కార్యక్రమం అక్టోబర్ 6 రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారమైందట!
ఈ చర్చా కార్యక్రమంలో "ఖూన్ కీ దలాలీ" అనే వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ లక్ష్మణ రేఖను దాటారనే అంశంపై చర్చ సాగిందని, ఆ సమయంలో జితేంద్ర పరువు ప్రతిష్టల పైన దాడి చేస్తూ గోస్వామి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ దానికి తీవ్ర పదజాలం ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ చర్చా కార్యక్రమం "టైమ్స్ నౌ" ఛానల్లో ప్రసారమవడంతో పాటు ఆ ఛానల్ వెబ్ సైట్ లోనూ ప్రచురితమైందని తెలిపారు. దీనికి సంబందించి ఏడు రోజుల్లో బేషరతు క్షమాపణ చెప్పాలని.. అలాకాని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.