18లక్షల ఖాతాల్లో 4లక్షల కోట్లు

Update: 2017-02-03 05:28 GMT
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్ద‌ నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం ఒక్కసారిగా 18 లక్షల ఖాతాల్లోకి రూ.4.17 లక్షల కోట్లు జమ అయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి గుర్తించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు  చైర్మన్ సుశీల్‌ చంద్ర మీడియాకు చెప్పారు. ఇన్‌ కంటాక్స్ శాఖ వద్దనున్న వివరాల ప్రకారం అనుమానాస్పద డబ్బు జమపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ 13లక్షల మందికి ఎస్సెమ్మెస్, ఈమెయిళ్లు పంపినట్లు తెలిపారు.

బడ్జెట్‌ పై నిర్వహించిన సుశీల్ చంద్ర మాట్లాడుతూ నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత 18 లక్షల ఖాతాల్లోకి అనుమానాస్పదరీతిలో రూ.4.17లక్షల కోట్లు జమ అయినట్లు గుర్తించామ‌ని తెలిపారు. మరో 10లక్షల ఖాతాల వివరాలు పరిశీలనలో ఉన్నాయని వివ‌రించారు. "మీ అకౌంట్లలో డబ్బు జమపై వివరాలు తెలుపాల్సిందిగా కోరుతూ 13లక్షలమందికి సందేశాలు పంపించాం" అని తెలిపారు. మిగతా ఐదు లక్షలమందికి ఈ రోజు ఎస్ ఎంఎస్‌ లు పంపిస్తామని చెప్పారు. ఆపరేషన్ క్లీన్ మనీ- స్వచ్ఛ ధన్ అభియాన్ కార్యక్రమం కింద ఈ దర్యాప్తు చేపట్టినట్టు  కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మ‌న్‌ పేర్కొన్నారు. ఆదాయపుపన్ను శాఖ ఈ 18 లక్షల ఖాతాల్లోకి అనుమానాస్పద రీతిలో డబ్బు జమ అయినట్లు గుర్తించిందని తెలిపారు. ఆయ వ్యక్తుల నుంచి వచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత.. వారిని పన్ను పరిధిలోకి తెస్తామని చెప్పారు. ముందుగానే ఆయా ఖాతాదారుల నుంచి వివరణ తీసుకుంటే.. ఆదాయపుపన్ను శాఖనుంచి వేధింపులు తప్పుతాయని సుశీల్‌ చంద్ర అభిప్రాయపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News