ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని మరోమారు తేలింది. ఏకంగా రూ.50 కోట్ల సుపారీ ముట్టజెప్పేందుకు డీల్ కుదిరిన వార్తలు వెలుగులోకి రావడమే ఇందుకు నిదర్శనం. ఈ డబ్బు సరిపోకపోతే... ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ కూడా పెట్టడం గమనార్హం. ముంబైలో జరిగే ఒక ర్యాలీలో మోడీని చంపేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఇంతకీ ఈ హత్యకు స్కెచ్ పడింది ఎక్కడో తెలుసా? పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో. ఇంత ప్రమాదకరమైన కుట్ర బయటపడింది మధ్యప్రదేశ్‌లోని ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగ కావడం విశేషం.
సాత్నా జిల్లాలో ఉండే సోని అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్ సారాంశం ఏంటంటే...ప్రధానమంత్రిని లేపేయాలి. అందుకు రూ.50 కోట్లు ఇచ్చేందుకు రెడీ. ఈ డీల్ నచ్చకపోతే ఇంకొంత మొత్తం ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారు. ముందుగా ఈ ఫోన్ కాల్‌ను సోనీ పట్టించుకోలేదు అయితే తర్వాత ఆయన ఆలోచనలో పడ్డారు. ప్రధానమంత్రిని మర్డర్ చేసేందుకు ఎంత పెద్ద స్కెచ్ వేశారో తెలిసిన వ్యక్తిగా ఆ విషయాన్ని చెవిన వేయడం తన బాధ్యతగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు మొదలుపెట్టారు.
అసలు సోనీకి వచ్చిన కాల్ నిజమైనదేనా? ఎవరైనా ఆకతాయిలు చేశారా? ఉద్దేశపూర్వంగానే సోనీకి కాల్ చేసి ఉంటారా? లేక ఎవరికో చేయబోయి సోనీకి చేశారా? అనే కోణంలో క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి భద్రత విషయంలో కూడా అధికారులు పునఃసమీక్షిస్తున్నారు. ఆయన పర్యటనల సమయంలో ఇకనుంచి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కసర్తతు చేస్తున్నారు