యుద్ధ పరిస్థితి వస్తే.. సరిహద్దుకు సైన్యాన్ని పంపడానికి ఆర్మీకి ఆరు నెలలు పట్టొచ్చేమోకానీ, తమ సైన్యాన్ని పంపా లంటే కేవలం మూడు రోజులు చాలనీ ఆర్ ఎస్ ఎస్ నేత మోహన్ భగవత్ అన్నారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో ఆరురోజులుగా జరుగుతున్న కార్యకర్తల సమావేశంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. `సంఘ్ కు మూడు రోజుల్లో సైన్యాన్ని సిద్ధం చేసే సత్తా ఉంది. అదే ఆర్మీకి ఆరు నెలల పడుతుంది. ఇదీ సంఘ్ సత్తా. దేశం అలాంటి పరిస్థితి ఎదురైతే.. ముందుకు సాగేందుకు స్వయం సేవక్ సంఘ్ సిద్ధంగా ఉంది. మా సైన్యాన్ని మూడు రోజుల్లో పంపించగలం' అన్నారు. సంఘ్ అనేది సైనిక లేదా పారామిలటరీ సంస్థకాదు. రాజ్యాంగం అందుకు వెసలుబాటు కల్పిస్తే సరికొత్త సైన్యాన్ని తయారుచేసి దేశం కోసం పోరాడేందుకు - అవసరమైతే ప్రాణాలర్పించేందుకు సంఘ్ కుటుంబం (ఆరెస్సెస్ కార్తకర్తలు) ఎప్పుడూ సిద్ధమే' అన్నారు.
కాగా, ఆర్మీపై చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకలోని జెవార్గిలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుల్లో మన సైనిక జవాన్లు రక్తం ధారపోస్తున్నారు. సైన్యం గురించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు వినడానికే బాధగా ఉంది. సైనికులు దేశ భద్రత కోసం పని చేస్తున్నారు. ప్రాణ త్యాగం చేస్తున్న సైనికులపై భగవత్ వ్యాఖ్యలు వారిని అవమానించడమే. ఇది ప్రతి భారతీయుడికి అవమానకరమే. ప్రతి సైనికుడు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తారు. భగవత్ వ్యాఖ్యలు మన జాతీయ పతాకాన్ని అవమానించడమే అని అన్నారు.
భారత సైన్యంపై భగవత్ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమని కేరళ ముఖ్యమంత్రి విజయన్ డిమాండ్ చేశారు. `భారత రాజ్యాంగంపై సంఘ్ కు గౌరవం లేదని ఆయన మాటలు మరోసారి స్పష్టమైంది. మస్సోలినీ ఇటలీలా - హిట్లర్ జర్మనీలంటూ మత రాజకీయంతో దేశాన్ని ఆర్ ఎస్ ఎస్ మార్చాలను కుంటోంది' అని విజయన్ విమర్శించారు. 'హిందూ టెర్రరిజం గురించి మేం హెచ్చరించినట్టే.. ఆయన సమాంతర సైన్యం గురించి ఆయన మాట్లా డారు. సైన్యాన్ని నడపడం రాజద్రోహమే' అని విజయన్ ట్వీట్ చేశారు. మోహన్ భగవత్ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేరళ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. కాగా, భగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆరెస్సెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది.