రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ను ఇప్పుడు సాధారణ వ్యక్తిలాగా చూడవద్దు. అవును ఎందుకంటే ఆయనకు డాక్టరేట్ వచ్చింది కాబట్టి. వైజ్ఞానిక శాస్త్రంలో గౌరవ డాక్టరేట్ పట్టాను మోహన్ భగవత్ అందుకున్నారు. నాగ్ పూర్ లోని మహారాష్ట్ర పశు - మత్స్య సంవర్థక శాస్త్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మోహన్ భగవత్ కు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేనని విద్యాసాగర్ రావు డాక్టరేట్ ప్రదానం చేశారు. వెటర్నరీ సైన్స్ - సామాజిక సేవారంగంలో కృషిచేసినందుకు భగవత్ కు ఈ డాక్టరేట్ ఇవ్వాలని యూనివర్సిటీ నిర్ణయించింది.
డాక్టరేట్ అందుకున్న సందర్భంగా భగవత్ మాట్లాడుతూ సమాజానికి దేశానికి లబ్ధి చేకూర్చేందుకు నేను కష్టపడి పనిచేస్తున్నా అని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయం - వివిధ రంగాల వ్యాపారాలు పశుసంపదపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. సుదీర్ఘ కాలంగా ఈ రంగం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడిప్పుడే దాని ప్రాముఖ్యంపై వాస్తవాలను గుర్తిస్తున్నామని చెప్పారు. పశుసంపద అభివృద్ధి కోసం వినూత్న రీతిలో నూతన పరిశోధనలు సాగాల్సి ఉన్నదని తెలిపారు. ఇందుకు అవసరమైన వనరులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద సామాజిక సంస్థ ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం గర్వకారణమని తెలిపారు. అందుకు యూనివర్సిటీ పాలక మండలిని అభినందించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/