మోడీతో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ సంతోషంగా లేరా?

Update: 2020-02-16 07:03 GMT
బీజేపీకి మాతృక ఆర్ ఎస్ ఎస్.. అలాంటి సంఘ్ నుంచే బీజేపీ పుట్టింది. దేశంలో బీజేపీ ప్రధానులను డిసైడ్ చేసేది.. బీజేపీని నడిపించేది సంఘ్ మాత్రమేనని చాలా సార్లు నిరూపితమైంది. అయితే తాజాగా మోడీ గద్దెనెక్కాక సంఘ్ ప్రభావం పడిపోతూ వస్తోందన్న విమర్శలున్నాయి.. నరేంద్రమోడీ దేశానికే కాదు.. సంఘ్ ను ఏకచ్ఛత్రాధిపత్యంతో ఏలేస్తున్నారని.. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ ను పట్టించుకోవడం లేదన్న కమలనాథుల్లో ఓ వర్గం కుమిలిపోతోందట..

ఈ నేపథ్యంలోనే గుజరాత్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

‘దేశంలో ఎవరూ సంతోషంగా లేరు.. మిల్లు ఓనర్లు - కూలీలు - ఉద్యోగులు - కంపెనీల అధినేతలు - టీచర్లు - విద్యార్థులు ఆందోళనలు చేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలోనూ అసంతృప్తి, నిరుత్సాహం ఉంది’ అని ఆర్ ఎస్ ఎస్ చీఫ్  మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే మోహన్ వ్యాఖ్యలు మోడీ పాలన గురించా లేదా దేని గురించి అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కానీ దేశ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అధికార బీజేపీని ఆయన డిఫెన్స్ లోకి నెట్టారు.

   

Tags:    

Similar News