ప్రతి మసీదులో శివలింగం కోసం వెతకొద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అంశంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగపూర్‌లో ఆర్ఎస్ఎస్ ముగింపు కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి అంశం ఎప్పటి నుంచో ఉందన్నారు. చరిత్రను మనం మార్చలేమని చెప్పారు. నేటి తరానికి చెందిన హిందువులు కానీ, ముస్లింలు కానీ ఆ వివాదాన్ని సృష్టించలేదని, ఆ ఘటన కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందని గుర్తు చేశారు. ఇస్లాం మతం బయట నుంచి వచ్చిందని, ఆ సమయంలో జరిగిన దాడుల్లో దేవాలయాలను నాశనం చేశారని మండిపడ్డారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేయడానికే ఇలా చేశారని మోహన్ భగవత్ ధ్వజమెత్తారు.
హిందువులకు పవిత్రమైన అనేక ప్రదేశాల్లో వివాదాలను సృష్టించారని మోహన్ భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఎప్పుడూ హిందువులు ఆలోచించరని అన్నారు. నేటి ముస్లింలకు పూర్వీకులు హిందువులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతస్తుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేందుకు వాళ్లను ఆ రోజుల్లో దూరంగా ఉంచారని ఆరోపించారు. అందుకే హిందువులు తమ మతపరమైన ప్రదేశాల రక్షణ కోరుతున్నట్లు మోహన్ భగవత్ వెల్లడించారు.
మన మెదడులో పెరుగుతూ ఉండే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని మోహన్ భగవత్ అన్నారు. సమస్యలను పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. చర్చల ద్వారా పరిష్కారం లభించని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపారు. కోర్టులు ఎటువంటి తీర్పు ఇచ్చినా.. ఎవరికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినా వాటిని స్వాగతించాలని భగవత్ కోరారు.
కోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని.. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని చెప్పారు. హిందువులను ఎప్పటికీ స్వాతంత్ర్యానికి దూరంగా ఉంచేందుకు.. వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వారి ఆలయాలను ధ్వంసం చేశారని మోహన్ భగవత్ మండిపడ్డారు. అందువల్లే నాడు కూల్చిన ఆలయాలను తిరిగి పునరుద్ధరించాలని హిందువులు కోరుకుంటున్నారని చెప్పారు.
ముస్లింలుగా ఉండాలనుకుంటే మంచిదేనని.. తమకు ఎటువంటి ఇబ్బంది లేదని మోహన్ భగవత్ అన్నారు. ఏ మతానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రతి ఒక్కరికీ తమ కంటూ సొంత నమ్మకాలు, విశ్వాసాలుంటాయని తెలిపారు. అయితే మనదంతా ఒకటే వారసత్వమని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఆర్ఎస్ఎస్ కు లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదు’ అని చెప్పారు.
అన్ని మతాలు పవిత్రమైనవేనని మోహన్ భగవత్ తెలిపారు. మన పూర్వీకులంతా ఒక్కటేనని చెప్పారు. జ్ఞానవాపి వివాదాన్ని ఎందుకు మరింత పెద్దది చేయాలని ప్రశ్నించారు. జ్ఞానవాపి పట్ల భక్తిభావం ఉందని, కానీ ప్రతి మసీదులోనూ శివలింగం కోసం వెతకడం సరికాదు అని భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం అంశం కొంతకాలంగా చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలను కూల్చి కట్టిన మసీదుల్లో తవ్వకాలు జరపాలనే డిమాండ్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ల నుంచి వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.