తెలంగాణ సర్కార్ ను అస్థిరపరచాలనుకొని స్కెచ్ గీసిన బీజేపీ ఎత్తుగడలను పసిగట్టిన కేసీఆర్ చిత్తు చేశాడు. బీజేపీ ఏజెంట్లను పట్టుకొని జైలుకు పంపాడు. బీజేపీ పరువును జాతీయ స్థాయిలో తీశాడు. అందుకే ఇక బీజేపీ వల్ల కాదని ఆర్ఎస్ ఎస్ రంగంలోకి దిగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోస్ ను టార్గెట్ చేసిన కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించడానికి ఆర్ఎస్ఎస్ తోపాటు అన్ని అనుబంధ సంఘాలు కీలకంగా పనిచేయాలని నిర్ణయించాయి. హైదరాబాద్లోనే ఆర్ఎస్ఎస్ తోపాటు వివిధ హిందూసంఘాలు సమావేశమై రాజకీయంగా వెళ్లకుండా.. అధికారం ఉందని బీఎల్ సంతోష్ ను జైలుకు పంపాలనుకున్నారని.. కేసీఆర్ ను ఇక సానుకూలంగా చూసే పరిస్థితి ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ కు పర్యవసనాలు ఎలాగుంటాయో చూపించాలని ఆర్ఎస్ఎస్ డిసైడ్ అయ్యింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే తన పేరును చేర్చినందుకు హైదరాబాద్ వచ్చి మరీ బీఎల్ సంతోష్ హెచ్చరించారు. ఆ హెచ్చరికల పర్యవసానాలు ఎలా ఉంటాయో కానీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా తమ శక్తియుక్తులు మొత్తం వెచ్చించాలని నిర్ణయించినట్టుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
బీఎల్ సంతోష్ ఆర్ఎస్ఎస్ పెద్దమనిషి.. ఆర్ఎస్ఎస్ తరుఫున బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు. ఆయన ఎలాంటి పదవులు తీసుకోరు. కేవలం పార్టీ కోసం పనిచేస్తారు. అలాంటి తమ నేతను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని.. తాము ఈ విషయంలో ఊరుకునేది లేదని ఆర్ఎస్ఎస్ నేతలు చెబుతున్నారు.
బీజేపీ ఏ రాష్ట్రంలో గెలవాలన్నా కూడా ఆర్ఎస్ఎస్ కీలకంగా పనిచేస్తుంది. ఉత్తరప్రదేశ్ లోనూ చేసి చూపించింది. పైకి కనిపించకుండా ఇంటింటి ప్రచారం చేస్తూ బీజేపీకి ఓటర్లుగా మార్చడంలో బీజేపీ పాత్ర కీలకం. త్రిపుర, అసోం, యూపీలో బీజేపీ గెలుపునకు ఆర్ఎస్ఎస్ కారణం. అందుకే తమ నేతను టార్గెట్ చేసిన కేసీఆర్ ను ఓడించడానికి ఆర్ఎస్ఎస్ పెద్దలు నిర్ణయించినట్టుగా సమాచారం. అయితే రాజకీయాల్లో అపర చాణక్యుడు, ఆరితేరిన కేసీఆర్ ను కొట్టడం బీజేపీ వల్లనే కాలేదు. ఈ ఆర్ఎస్ఎస్ తో ఏం కాదని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.