తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ అనుమానితుల సంఖ్య క్షణ క్షణానికి పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 11 కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదైనట్లు సమాచారం. నిన్న ఒక్కరోజే 5 అనుమానిత కేసులు నమోదుకావటం మరింత భయాన్ని కలిగిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు ఎవరికీ కరోనా ఉన్నట్టు నిర్ధారణ కాకపోయినప్పటికీ... ప్రజల్లో మాత్రం ఆందోళన కొనసాగుతోంది.
తాజాగా తెలంగాణ నుంచి ఏలూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్‌కు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడం కలకలం రేపింది. దీంతో వెంటనే బస్సులోని ప్రయాణికులు, బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు. చింతలపూడిలో బస్సును నిలిపి , వెంటనే మహిళా కండక్టర్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యులు పరీక్షలు చేపట్టారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధారణ జ్వరంగా నిర్ధారించారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మహిళా కండక్టర్ ను వైద్యులు పరిశీలనలో ఉంచారు. అలాగే , ఆమె రక్త నమూనాలని ల్యాబ్ కి పంపించి కరోనా వైరస్ ఉందా.. లేదా అన్నది నిర్ధారిస్తామంటున్నారు.
అయితే, జలుబు, దగ్గు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ముందు జాగ్రత్తగానే ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేసినట్టు డ్రైవర్ , బస్సులోని వారు తెలిపారు. వైద్యులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే ఏపీలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదంటున్నారు అధికారులు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూనే.. అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు.