కోడి పుంజుకు టికెట్ కొట్టిన వైనం తెలంగాణలో చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు ఆర్టీసీ బస్సు ఎక్కిన తర్వాత.. ప్రయాణికుడితో పాటు కోడిపుంజును గుర్తించిన కండక్టర్ దానికి టికెట్ తీసుకోవాలని చెప్పటంతో టికెట్ తీసుకోక తప్పలేదు. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతం తెలంగాణలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
గోదావరిఖని నుంచి కరీంనగర్ కు బయలుదేరిన టీఎస్ ఆర్టీసీ బస్సు సుల్తాన్ బాద్ వద్ద మహ్మద్ అలీ అనే ప్రయాణికుడు బస్సు ఎక్కాడు. కరీంనగర్ వెళ్లేందుకు అతడు టికెట్ తీసుకున్నాడు.
అనంతరం అతడితో పాటు ఉన్న సంచిలో కోడి పుంజు ఉందన్న విషయాన్ని గుర్తించిన కండక్టర్.. దానికి టికెట్ తీసుకోవాలన్నాడు. కోడి పుంజుకు టికెట్ ఏమిటని అలీ ప్రశ్నిస్తే.. కోడి పుంజుతో పాటు.. మరే పక్షులు.. పెంపుడు జంతువులను బస్సులోకి అనుమతించకూడదని చెప్పాడు.
అలా అని దారి మధ్యలో దింపేయటం వల్ల ప్రయాణికుడికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో.. టికెట్ తీసుకోవాలని కోరాడు. దీంతో.. రూ.30 పెట్టి కోడిపుంజుకు టికెట్ తీసుకున్నాడు. దీనికి సంబంధించి టికెట్ ఇప్పుడు వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.
అలీ సంచిలో కోడిపుంజు ఉండటంపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేశారని.. దీంతో.. అతన్ని మధ్యలో దించేస్తే.. ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో టికెట్ కొట్టినట్లుగా సదరు కండక్టర్ చెబుతున్నారు. కోడితో బస్సు ఎక్కితే నిబంధనలకు విరుద్దం.
కానీ.. కోడి మాంసాన్ని (చికెన్) పాకెట్ తో వెళితే మాత్రం ఎవరూ ఏమీ అనకపోవటం దేనికి నిదర్శనం? ఏమైనా కోడి పుంజుకు టికెట్ కొట్టిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.