అనుకున్నంతా అయ్యింది. ఇన్నాళ్లు మినుకు మినుకుమంటూ హైకోర్టు ఆశలు కల్పించింది. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులం తా హైకోర్టు తమకు న్యాయం చేస్తుందని వేయి కళ్లతో ఎదురు చూశారు. కానీ హై కోర్టు కూడా తాజా గా చేతులు ఎత్తేసింది. ప్రభుత్వాని కి సూచించినా ఫలితం కనిపించక పోవడంతో ఇక లేబర్ కోర్టే దిక్కు అని చెప్పకనే చెబుతోంది.
హై కోర్టు తాజాగా ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వంతో చర్చించడానికి ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తులతో కమిటీ వేసి నివేదిక ను బట్టి చేద్దామని ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. లేబర్ కమిషనర్ కు, లేబర్ కోర్టులోనే ఈ సమ్మెను తేల్చుకోవాలని తెలంగాణ ప్రబుత్వం స్పష్టం చేసింది.
దీంతో హైకోర్టు ద్వారా సమ్మె పరిష్కారం అవుతుందని ఆశ పడ్డ కార్మికుల ఆశలు అడియాశలైనట్లే.. ఇక లేబర్ కోర్టులో సమ్మె ఎప్పుడు తెగుతుందో తెలియని పరిస్థితి. ఓవరాల్ గా ఆర్టీసీ సమ్మె కు ఇక తెగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముగింపు లేని ఆర్టీసీ సమ్మెపై ఇక కార్మికులు ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది.
హై కోర్టు ఎన్ని రకాలుగా కేసీఆర్ సర్కారుకు ఆదేశాలు ఇచ్చినా చట్టంలోని కొన్ని లోటుపాట్లతో తప్పించుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ కాకపోవడం.. కార్పొరేషన్ కావడం తో దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేని పరిస్థితి హైకోర్టుదీ.. ఇటీవల చర్చలు జరపాలని కోరడంతో ప్రభుత్వం కూడా కార్మికులను ఆహ్వానించింది. కానీ ఆర్టీసీ సంఘాల నేతలే మొండిపట్టుకు పోయి 21డిమాండ్లపై చర్చించకుండా విలీనం మాట ఎత్తడంతో సర్కారు చిర్రెత్తికొచ్చి ఇక చర్చలే లేవు అని తెగేసి చెప్పింది. అప్పుడే కార్మికులైనా, ప్రభుత్వమైనా తగ్గి ఉంటే ఇప్పటి కీ సమ్మె ముగిసేది. ఇక కార్మికులపై ఎస్మా చట్టం కనుక ప్రయోగించడానికి హై కోర్టు అంగీకరిస్తే ఉన్న వారిందరి ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఈ పరిణామాల నేపథ్యం లో ఇక సమ్మెకు పరిష్కారం కష్టమేనా అన్న భావన నెలకొంది. హై కోర్టు చేతులెత్తేయడం.. వ్యవహారం లేబర్ కోర్టుకు వెళ్లుతుండడం తో ఈ పంచాయితీ తెగడం కష్టమేనన్న అంచనాలు నెలకొంటున్నాయి.