అధికారం ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా విరుచుకుపడితే.. లేనప్పుడు అదో శాపంగా మారుతుంది. చేతిలో పవర్ ఉన్నా లేకున్నా తనకు తిరుగులేదనుకునే నేతలు కొందరు. ఆ కోవలోకే వస్తారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. ట్రావెల్ బస్సుల వ్యాపారంలో ఆయనకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు నచ్చని నిర్ణయాల్ని తీసుకునే అధికారుల మీద ఒంటి కాలి మీద విరుచుకుపడే జేసీకి ఈ మధ్య కాలంలో అదే పనిగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
మొన్నీమధ్యనే ఆర్టీఏ అధికారులు ట్రావెల్ బస్సుల్ని సీజ్ చేశారు. దీంతో.. కోర్టును ఆశ్రయించగా.. వాటిని రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో బయటకు వచ్చిన బస్సుల్ని తాజాగా మరోసారి సీజ్ చేయటం షాకింగ్ గా మారింది.
దీనిపై జేసీ అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతున్నారు. తాము గడిచిన 74 ఏళ్ల నుంచి ట్రావెల్ బిజినెస్ చేస్తున్నామని.. తమ ట్రావెల్స్ కు చెందిన 80 బస్సుల్ని సీజ్ చేశారని.. ఇదంతా తమ మీద కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. ఒక్క దివాకర్ ట్రావెల్స్ మాత్రమే రూల్స్ ను బ్రేక్ చేస్తుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ట్రిబ్యునల్ బస్సుల్ని వదిలి పెట్టాలని ఆదేశించినా.. ఆర్డీవో అధికారులు మాత్రం ఒకప్టటాన తనను వదిలిపెట్టటం లేదని మండిపడుతున్నారు. తనకు తిరుగులేదని.. తన మాటే శాసనమనే జేసీ లాంటి వ్యక్తి నోటి నుంచి ఇలాంటి బేల మాటలు రావటం ఏమిటి? అందుకే అంటారేమో కాలానికి మించిన శక్తివంతమైనది మరొకటి ఉండదని.