ముస్లిం మహిళలకు బ్రిటన్లో అన్ని ఆంక్షలా?

Update: 2016-05-09 09:38 GMT
ముస్లిం దేశాల్లో మహిళల మీద ఆంక్షలు మామూలే. ఇక.. తాలిబన్లు.. ఐఎస్ తీవ్రవాదుల అధిపత్యం సాగే ప్రాంతాల్లో ముస్లిం మహిళల బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారి మీద ఆంక్షల కత్తి అనుక్షణం వేలాడుతూనే ఉంటుంది. ఈ దేశాల్లో ముస్లిం మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు విన్న వారంతా షాక్ తినటమే కాదు.. ఈ రోజుల్లో కూడా అంత అనాగరికంగా ఆంక్షలు విధిస్తారా? అంటూ గుస్సా అవుతారు.

అయితే.. ప్రాశ్చాత్య దేశాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బ్రిటన్ లో నివసించే మహిళలపైనా కొత్తగా విధిస్తున్న ఆంక్షల వైనం తాజాగా మీడియా సంస్థ ఒకటి బ్రేక్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రిటన్ లోని మహిళా సంఘాలు.. మసీదులు ప్రచురించిన రూల్స్ ను ‘‘ద టైమ్స్’ మీడియా సంస్థ బయట పెట్టి అందరిని విస్మయానికి గురి చేసింది.

తాలిబన్ల రాజ్యంలో మాదిరి మహిళలకు విధించిన నిబంధనల్ని చూసి మతిపోయేలా చేయటమే కాదు.. ఈ తీరుపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమయ్యేలా చేసింది. మసీదులు.. ముస్లిం సంఘాలు తమ వెబ్ సైట్లో ప్రచురించిన రూల్స్ మీద విమర్శలు వెల్లువెత్తటంతో వారు కాస్తంత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంతకీ బ్రిటన్ లో నివసించే ముస్లిం మహిళల మీద పెట్టిన ని‘బంధనాలు’ చూస్తే..

= బ్రిటన్ ముస్లిం మహిళలు ఫ్యాంట్లు వేసుకోకూడదు.

= సోషల్ మీడియాకు ముస్లిం మహిళలు దూరంగా ఉండాలి.

= ఒకవేళ ఇప్పటికే అకౌంట్లు ఉంటే వాటిని క్లోజ్ చేయాలి.

= ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు.

= భర్త అనుమతి లేకుండా ఏ పని చేయకూడదు.

= భర్త అనుమతి లేకుండా బయకు వెళ్లకూడదు.

= ముస్లిం మహిళలు మోడలింగ్.. యాక్టింగ్ చేయకూడదు.

= ముస్లిం మహిళలు గర్భస్రావం చేయించుకోకూడదు.
Tags:    

Similar News