గది కోసం అధికార.. విపక్షాలు ఒకేమాట మీద

Update: 2015-07-22 04:46 GMT
కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం కలిగించే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారు వినిపిస్తూ.. తమ అభిప్రాయాల్ని కాస్తంత మార్చుకోవటానికి సైతం ససేమిరా అనే అధికార.. విపక్ష సభ్యులు తాజాగా ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రావటమే కాదు.. తమందరిదీ ఒకేమాట అని ఐక్యతా రాగం వినిపించిన అరుదైన ఉదంతం.

విషయం ఏదైనా కానీ.. రచ్చ రచ్చ చేస్తారే కానీ.. ఒకే మాట మీద రాజకీయ పక్షాలన్నీ ఏక తాటి మీద చాలా అరుదుగా వస్తాయి. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాకపోతే.. అది ప్రజాప్రయోజనం కోసం కాకపోవటం గమనార్హం. పార్లమెంటులో స్మోకింగ్ రూమ్ అంటూ ఒక గది ఉండేది. దాన్ని ప్రస్తుతం వేరే అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

గతంలో మాదిరి స్మోకింగ్ రూమ్ ని ఏర్పాటు చేయాలని.. ఇప్పుడా గదిలో ఏర్పాటు చేసిన స్టెనోగ్రాఫర్లను వేరే గదికి తరలించాలన్న డిమాండ్ ను స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు. అయితే.. ఈ విషయంపై ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రజా సమస్యల విషయంలో కాక.. తమ వ్యక్తిగత విషయంలో మాత్రం సైద్ధాంతిక విభేదాల్ని పక్కన పెట్టేసి ఒకే తాటి మీద నిలబడటం గమనార్హం.
Tags:    

Similar News