అమ్మ జయలలిత మరణం రేపిన కలకలం ఒక పట్టాన చల్లారేటట్లుగా కనిపించట్లేదు. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆమె మరణం వరకూ పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవటం.. అమ్మ మరణం తర్వాత కొన్ని వారాలకు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆమె విధేయుడు పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
అమ్మ ఆత్మ తనతో మాట్లాడారని.. పార్టీని కాపాడాలని కోరినట్లుగా ఆమె సమాధి దగ్గర ధ్యానం చేసిన సందర్బంగా చెప్పిన పన్నీర్.. తర్వాత చిన్నమ్మపై తిరుగుబాటు చేశారు. ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. శశికళ జైలుకు వెళ్లటం.. ఆమె బంధువు దినకరన్ నాటకీయ ఫక్కీలో బుక్ అయి జైలుకు వెళ్లటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన పోయెస్ గార్డెన్ లోని వేద నిలయాన్ని చేజిక్కించుకోవటానికి చిన్నమ్మ వర్గం పావులు కదిపిన విషయం తెలిసిందే. వేద నిలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదు. ఇదిలా ఉంటే.. వేద నిలయానికి సంబంధించిన ఒక సంచలన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అమ్మ ఆత్మ దెయ్యమై వేద నిలయంలో తిరుగుతోందన్న ప్రచారం రోజు రోజుకి పెరుగుతోంది. రాత్రి అయితే చాలు.. వేద నిలయంలో అరుపులు.. కేకలతో దద్దరిల్లుతోందన్న ప్రచారం అంతకంతకూ పెరుగుతోంది. వేద నిలయం నుంచి వస్తున్న శబ్దాలతో భయభ్రాంతులకు గురి అవుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అమ్మ మరణం తర్వాత.. ఆమె నెచ్చెలి శశికళ వేద నిలయంలోనే ఉండటం.. ఆమె పుణ్యమా అని మన్నార్ గుడి మాఫియా అమ్మకు ఇష్టమైన ఇంట్లో తిష్ట వేశారు.
అక్రమాస్తుల కేసులో ఎప్పుడైతే శశికళ జైలుకు వెళ్లారో.. అప్పటి నుంచి వేద నిలయంలో ఆమె బంధువు దినకరన్ ఉంటున్నారు. అయితే.. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి రూ.50కోట్ల లంచం ఇవ్వజూపిన ఉదంతంలో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం జైల్లో ఉన్నారు. నాటి నుంచి వేద నిలయంలో ఎవరూ ఉండటం లేదు. శశికళ చేతికి వేదనిలయం వెళ్లిన తర్వాత.. అందులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గదిని దినకరన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. అమ్మ ఆత్మ దెయ్యంగా మారి రాత్రిళ్లు తిరుగుతోందని.. ఆమెకు నచ్చని వారు వేదనిలయం వైపు వెళితే చాలు.. పెద్దపెద్దగా శబ్దాలు చేస్తూ హడలెత్తిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదంతా కావాలని చేస్తున్న ప్రచారమని.. శశికళ తరఫు వారు వేద నిలయాన్ని తమ సొంతం చేసుకోవటానికి ఆడుతున్న డ్రామాగా చెబుతున్నారు. అదే సమయంలో.. అధికారులు వేద నిలయంలోకి అడుగుపెట్టటానికి సైతం భయపడేలా చేయటం కోసమే చిన్నమ్మ వర్గం ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఒకప్పుడు కళకలలాడిన వేదనిలయం.. ఇప్పుడు ఎవరూ ఉండకుండా మూసివేసి ఉండటమే కాదు.. అమ్మ ఆత్మ దెయ్యమై తిరుగుతోందన్న ప్రచారంతో ఆ భవనం వైపు రావటానికి చాలామంది ఇష్టపడటం లేదని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/