మోడీకి మ‌ర‌క‌.. రూపాయి ఆల్ టైం డౌన్‌

Update: 2018-06-28 06:03 GMT
అధికారం చేతికి ఇస్తే చాలు పొడిచేస్తా.. దేశం మొత్తాన్ని మార్చేస్తా.. నాతోనే మీకు అచ్చేదిన్ అంటూ మాట‌లు చెప్పిన మోడీ మాట‌ల త‌త్త్వం ఇప్పుడిప్పుడే ప్ర‌జ‌ల‌కు బోధ ప‌డుతోంది. చ‌రిత్ర‌లో తొలిసారిగా అమెరికా డాల‌ర్ తో రూపాయి విలువ భారీగా ప‌త‌న‌మైంది. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో ఈ రోజు భారీగా ప‌త‌న‌మైంది.

గ‌డిచిన కొద్ది రోజులుగా అంత‌ర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో పాటు.. పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు సైతం రూపాయి విలువ ప‌త‌న‌మ‌య్యేలా చేశాయి. అయితే.. రూపాయి ప‌త‌నాన్ని అడ్డుకోవ‌టం మోడీ స‌ర్కారుకు సాధ్యం కాలేదు. వాస్త‌వానికి మ‌న్మోహ‌న్ హ‌యాంలో ప‌త‌న‌మైన రూపాయి విలువ‌ను తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే బ‌లోపేతం చేస్తామంటూ చెప్పిన మాట‌ల్లో డొల్ల‌త‌నం కూడా తాజా ప‌రిస్థితికి కార‌ణంగా చెప్పాలి.

చ‌రిత్ర‌లో తొలిసారి అమెరిక‌న్ డాల‌ర్ ఒక్కటి రూ.69ల‌కు చేరుకుంది.  బుధ‌వారం నాటి ట్రేడింగ్‌ లో 37 పైస‌ల వ‌ర‌కూ ప‌డిపోయిన రూపాయి మార‌కం విలువ రూ.68.61 పైస‌ల వ‌ద్ద ముగిసింది. అనంత‌రం ఈ రోజు ట్రేడింగ్ స్టార్ అయిన త‌ర్వాత 49 పైస‌లు ప‌డిపోయింది. దీంతో.. రూ.69.01 ట్రేడ్ అయ్యింది. ఇది ఆల్ టైం హై గా చెప్పాలి.

అనంత‌రం  కాస్త మెరుగుప‌డి ట్రేడింగ్ సాగుతోంది. ఒక ద‌శ‌లో రూ.69లకు మార్కెట్ లో ట్రేడ్ అయిన‌ప్ప‌టికీ.. అంత‌లోనే బ‌లం పుంజుకొని రూ.69కి కాస్త అటు ఇటుగా ఊగిస‌లాడుతోంది. డాల‌ర్ తో రూపాయి మార‌క విలువ ఇంత భారీగా ప‌డిపోవ‌టంపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుంటే.. మార్కెట్ విశ్లేష‌కులు మాత్రం అంత‌ర్జాతీయ ప‌రిణామాలు.. ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌టం.. ద్ర‌వ్యోల్బ‌ణం  కార‌ణంగానే రూపాయి విలువ త‌గ్గిన‌ట్లుగా చెబుతున్నారు. కార‌ణం ఏమైతే మాత్రం మ‌న రూపాయి మ‌రింత బ‌క్క‌పలుచ‌న అయ్యింద‌న్న‌ది నిజం.
Tags:    

Similar News