2022 ఫిబ్రవరిలో మొదలయిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిది నెలలు గడిచినా ఇంకా సాగుతూనే ఉంది. మొదట్లో ఉక్రెయిన్‌పై సులువుగా విజయం సాధించేలా కనిపించిన రష్యా ఎదురీదుతోంది. అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ గట్టిగా పోరాటం చేస్తోంది. మొదట్లో తమ నుంచి రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఒక్కొక్కటిగా ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో రేడియో ధార్మిక వ్యర్థాలను వెదజల్లే బాంబుల్ని ఉక్రెయిన్ ప్రయోగించే అవకాశం ఉందని రష్యా ఆందోళన చెందుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి సెర్గే షొయిగు ఆందోళన వెలిబుచ్చారు. ఇలా చేయడం వల్ల అణు విస్ఫోటం మాదిరి విపరిణామాలు లేకపోయినా అనేక ప్రాంతాలపై రేడియో ధార్మికత ప్రభావం పడుతుందని ఆయన భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
తమపై ఉక్రెయిన్ రేడియో ధార్మికతతో రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించేందుకు సమాయత్తమవుతోందని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు విమర్శలు చేస్తున్నారు.
దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సేనలు మున్ముందుకు చొచ్చుకువస్తున్న నేపథ్యంలో రష్యా రక్షణ మంత్రి అయిన సెర్గే షొయిగు.. బ్రిటన్, ఫ్రాన్స్, తుర్కిమెనిస్థాన్ దేశాల రక్షణ మంత్రులతో ఫోన్లో సంభాషించారు. బ్రిటన్ మాత్రం రష్యా మంత్రుల మాటల్ని తోసిపుచ్చింది. మరింతగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకే రష్యా ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మరోవైపు తాము రష్యాకు కోల్పోయిన ఖేర్సన్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ దళాలు దూసుకు వస్తుండడంతో రష్యా తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే పనిలో ఉంది. ఉక్రెయిన్ భారీ స్థాయిలో దాడి చేయనుందన్న వార్తలు రష్యాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ఉంటున్న ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం ఇందుకు నిదర్శనం.
కాగా ఖేర్సన్ ప్రాంతం.. యుద్ధం మొదలైన ఫిబ్రవరి నుంచి రష్యా అధీనంలోనే ఉంది. ఇటీవల దీన్ని రష్యా భూభాగంలోకి కలుపుతూ అధ్యక్షుడు పుతిన్ సంతకాలు కూడా చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.