ప్రస్తుతం రష్యాలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయో తెలిసిందే. దేశాధ్యక్ష పదవిలో ఉన్న పుతిన్.. తాను బతికి ఉన్నంత కాలం తన చేతిలో తప్పించి.. మరెవరి చేతిలోనూ పవర్ లేకుండా రాజ్యాంగాన్ని సైతం మార్చేయటం తెలిసిందే. అదే సమయంలో పుతిన్ తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతూ.. అతడి తప్పుల్ని తరచూ ఎత్తి చూపే విపక్ష నేత అలెక్సీ నావల్ని ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో తనను తీవ్ర వేదనకు గురి చేస్తున్నట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.
జైల్లో ఆయనకు ఎదురవుతున్న హింసలపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. విపక్ష నేతను జైలు నుంచి విడుదల చేయాలంటూ విద్యార్థులు.. వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఆందోళనల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నాయంటూ రష్యా వ్యాప్తంగా 90 నగరాల్లో దాదాపు 3వేల మందిని అదుపులోకి తీసుకున్నారు. అలా అరెస్టు అయిన వారిలో నావల్నీ సతీమణి యూలియా కూడా ఉన్నారు.
ఇక.. జైల్లో తనకు ఎదురవుతున్న హింసల గురించి వివరించారు. రాత్రి వేళలో తనను ప్రతి గంటకు నిద్ర లేపుతున్నారని.. తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. తనకు చికిత్సను నిరాకరిస్తున్నారని.. తన ఆరోగ్య సమస్యల్ని పరీక్షించేందుకు నిపుణుడ్ని లోనికి అనుమతించాలని కోరుతున్నా.. అధికారులుస్పందించటం లేదన్నారు. దీంతో.. తన సమస్యలపై స్పందించని నేపథ్యంలో నిరాహార దీక్షకు దిగుతూ నిర్నయం తీసుకున్నారు. విపక్ష నేత విషయంలో అధ్యక్షుల వారు వ్యవహరించిన తీరుపై ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది. మరి.. తాజా దీక్ష నిరసనల్ని మరింత ముదిరేలా చేస్తాయని చెప్పక తప్పదు.