ఉక్రెయిన్ లో రష్యా దుశ్చర్యకు పాల్పడుతోంది. ఆ దేశంలో ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్ లో బాంబుల మోత మోగుతోంది. అయితే ఈ యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. యుద్ధ సమయంలో రష్యాపై అమెరికా వంటి దేశాలు ఇటీవలె ఆంక్షలు విధించాయి. తాజాగా క్రీడా లోకం కూడా రష్యా తీరును తప్పుబట్టింది. ఫిఫా మరో షాక్ ఇచ్చింది.
ఉక్రెయిన్ పై తెగబడుతున్న రష్యాపై ఫిఫా ప్రపంచకప్ వేటు వేసింది. ఈ ఏడాది జరిగే ప్రపంచకప్ తో పాటు అన్ని ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ పోటీలు, లీగ్ ల నుంచి బహిష్కరించింది. ఈ మేరకు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో ప్రకటించాయి. ఫిఫా వరల్డ్ కప్ ఈ ఏడాది చివర్లో జరగనుంది. అందుకోసం రష్యా పురుషుల టీమ్ క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ మార్చిలో జరగాల్సి ఉంది. అయితే పోలాండ్ ఇదివరకే రష్యాతో ఫుట్ బాల్ క్వాలిఫైయింగ్ పోటీల్లో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది.
అంతేకాకుండా యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో రష్యా మహిళల టీమ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ లో జులై నెలలో జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా యుద్ధ పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఫుట్ బాల్ జట్లతో ఫిఫా, యూఈఎఫ్ఏ నిషేధం వేటు వేసింది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ దురాక్రణకు పాల్పడడం సరికాదని భావిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ నడుమ భీకర పోరు సాగుతూనే ఉంది. ఇటీవల ఇరు దేశాల నడుమ చర్చలు జరిగాయి. కానీ అవి అసంపూర్ణం కావడంతో యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ దేశంలో బాంబుల మోత మోగుతోంది. పరిస్థితి అణ్వయుధాల దాకా రావొద్దని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. తక్షణమే యుద్ధాన్ని విరమించుకోవాలని కోరుతున్నాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ కూడా... శాంతియుతంగా చర్చలు చేసుకోవాలని సూచించారు.
అయితే ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వివిధ దేశాల ప్రజలు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రభుత్వాల సహకారంతో స్వదేశానికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగను ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి... ఇక్కడికి తీసుకొస్తున్నారు. అందుకోసం ప్రధాని మోదీ.. రొమేనియా దేశ ప్రధానితో కూడా చర్చలు జరిపారు. ఆ దేశ సాయంతో భారతీయులను వేగంగా ఇండియాకు తీసుకొస్తున్నారు.