పాక్ కు షాకిచ్చిన మరో అగ్రదేశం!

Update: 2016-10-04 04:18 GMT
అంతర్జాతీయంగా పాక్ ను ఒంటరిని చేయాలనే మోడీ కల నెరవేతున్నట్లే ఉంది. ఈ మేరకు మోడీ ఆలోచనకు బలం చేకూరుస్తూ... పాక్ విధానాలపైనా, ఉగ్రవాదులకు అండగా ఉంటూ ఆశ్రయం కల్పించడంపైనా తాజాగా రష్యా స్పందించింది. ఇప్పటికే ఒక అగ్రదేశం అమెరికా భారత్ కు అనుకూలంగానే ఉన్న సమయంలో, మరో అగ్రరాజ్యం రష్యా కూడా పాక్ కు వ్యతిరేకంగా మాట్లాడటం ఆహ్వానించదగ్గ పరిణామమే కాదు, పాక్ కు అద్భుతమైన షాకిచ్చే విషయం కూడా. ఈ మేరకు భారత్ కు మద్దతుగా దేశంలోని రష్యా రాయబార కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ఉరి ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులను రష్యా తాజాగా సమర్థించింది. భారత్ పై కక్షగట్టిన పాక్ కు షాక్ ఇచ్చేలా.. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో భారత్ కు మద్దతు పలికింది రష్యా. సర్జికల్ స్ట్రైక్స్ పై స్పందించిన భారత్ లోని రష్యా రాయబారి అలెగ్జాండర్ ఎం కదకిన్... యూరీలో భారత సైనికులపై దాడిచేసిన ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చినట్లు మొట్టమొదట బహిరంగంగా ప్రకటించిన దేశం రష్యాయేనని పేర్కొన్నారు. అలాగే భారతదేశంపై ఉగ్రవాద కార్యకలాపాలకు తాము వ్యతిరేకమని ఈ సందర్బంగా కదకిన్ స్పష్టం చేశారు. మొదటినుంచీ తాము బహిరంగగానే ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నామని కదికన్ గుర్తుచేశారు. ఉగ్రవాదచర్యల నుంచి ఏ దేశమైనా తమను తాము కాపాడుకోవాల్సిందేనన్న కదకిన్.. భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను సమర్థించారు.

ఇదే సమయంలో ఇక కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని దౌత్య వేదికలమీద భారత్ పై ఆరోపణలు గుప్పిస్తోన్న పాకిస్థాన్ వాదనపై స్పందించిన కదనిన్... ఉగ్రవాద దాడులే అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘనలు అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో భారత్ కు వ్యతిరేకంగా చేపడుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని తక్షణం ఆపేయాల్సిందిగా పాకిస్థాన్‌ కు ఆయన సూచించారు. "సైనిక స్థావరాలపైనా, భారత్ లో ప్రశాంతంగా ఉన్న ప్రజలపైనా ఉగ్రవాద దాడులు చేయడమే అత్యంత దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన" అని కదకిమ్ అభిప్రాయపడ్డారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News