రష్యాకు కానున్న ప్రధాని అతడేనా?

Update: 2020-01-16 04:43 GMT
రష్యా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వ్లాదిమిర్ పుతిన్ పుణ్యమా అని.. రష్యా రాజకీయం ఎలా మారిందో తెలిసిందే. విపక్షాలకు అవకాశం లేకుండా చేయటమే కాదు.. తనను వ్యతిరేకించే వారు రాజకీయంగా కనుమరుగు అయ్యేలా చేయటంలో పుతిన తర్వాతే ఎవరైనా? అన్న విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తినా.. అవేమీ నిరూపితం కావటం లేదు.

పుతిన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ.. ఆయన నిర్ణయాల్ని అమలు చేయటంలో మంచి పేరున్న మెద్వదేవ్ తాజాగా రష్యా ప్రధానిగా తన పదవికి రాజీనామా చేయటం తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని పుతిన్ కు అందజేశారు కూడా. ఇలాంటివేళ రష్యాకు కొత్త ప్రధాని రానున్నారు.

ఇటీవల పుతిన్ షురూ చేసిన రాజ్యాంగ సంస్కరణల విషయంలో మెద్వదేవ్ విభేదిస్తున్నారు. దీంతో ఆయన తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. రష్యా కొత్త ప్రధానిగా మిషుస్తిన్ పేరును పుతిన్ తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటివరకూ మిషుస్తిన్ ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్ కు అధినేతగా ఉన్నారు. ఇప్పుడాయన రష్యా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ మొద్వదేవ్ ను ప్రధానిగా బాధ్యతల్ని నిర్వహించాలంటూ పుతిన కోరారు. దీంతో.. ఆయన ఓకే అనటం ఖాయం. తనకు నచ్చిన.. తాను మెచ్చిన వ్యక్తిని దేశ ప్రధాని కుర్చీలో కూర్చోపెట్టటం ద్వారా.. తన ఎజెండాను పుతిన్ పక్కాగా అమలు చేస్తారనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News