అది రష్యా విమానం.. యురల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ 321. రష్యాల్లోని హుకోన్ స్కీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్రిమియాలోని సిమ్ ఫెరోపోల్ కు వెళుతోంది. విమానం టేకాఫ్ అయ్యింది. కొద్దిసేపటికే ఓ భారీ పక్షుల గుంపు విమానానికి అడ్డువచ్చింది. విమానం ఇంజిన్ లోని ఫ్యాన్ లోకి పక్షులన్నీ పడిపోయాయి. ఈ దెబ్బకు అందులో మంటలు చెలరేగాయి. విమానం పేలిపోవడం ఖాయమని ప్రయాణికులంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నారు. కానీ అద్భుతం జరిగింది. పైలెట్ సమయ స్ఫూర్తితో ఏకంగా 233మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
రష్యా విమాన పైలెట్ చాకచక్యంతో ఇప్పుడు భారీ విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కేవలం 23 మంది మాత్రమే గాయపడడం గమనార్హం. 233మంది ప్రాణాలతో బయటపడ్డారు.
విమానం టేకాఫ్ అయిన వెంటనే మాస్కోకు కిలోమీటర్ దూరం పోగానే పక్షుల గుంపు విమానాన్ని ఢీకొని ఇంజిన్ లో పడిపోయాయి. ఇంజిన్ లో మంటలు చెలరేగి పాడైపోయింది. దీంతో పైలెట్ ద్మీర్ యుసుపోవ్ సమయస్ఫూర్తితో అక్కడే కిందనున్న మొక్కజొన్న పొలాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశాడు. సురక్షితంగా మొక్కజొన్న చేలల్లో దించాడు. దీంతో విమానానికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. లాండింగ్ గేర్లు కూడా వేయకుండా ఇంజిన్ పతనం అవుతుంటే ఇలా దించడం అద్భుతమంటూ పైలెట్ ను అందరూ కొనియాడుతున్నారు. ఇది నమ్మలేని అద్భుతమని రష్యా మీడియా పైలెట్ పై ప్రశంసలు కురిపిస్తోంది.
కాగా 2009లో కూడా ఇలా ఇంజిన్ ఫెయిల్ అయిన సమయంలో అమెరికా విమానం ఒకటి హడ్సన్ నదిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పుడు మొక్కజోన్న చేలల్లో విమానం దించి ప్రమాదాన్ని నివారించాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.ఈ రెండు ఘటనలు చిరస్థాయిగా నిలిచిపోయాయి.