హిట్లర్ వదిలేసినా.. పుతిన్ మాత్రం వదల్లేదు..

Update: 2022-03-22 23:30 GMT
ఉక్రెయిన్ యుద్ధం ఎన్నో విషాదాలను నింపుతోంది. ఎన్నో పగలు, ప్రతీకారాలకు వేదిక అవుతోంది. రోజుకో కథ బయటకు బయటపడుతోంది. ఒకప్పుడు హిట్లర్ సైన్యం నుంచి తప్పించుకున్నా ఓ ధీరుడు ఇప్పుడు పుతిన్ యుద్ధ దాహానికి బలైపోయాడు. ఇప్పుడాయన స్టోరీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

ఉక్రెయిన్ లో జరిగిన బాంబు దాడుల్లో తాజాగా 'బోరిస్ రోమన్ చెన్ కో' అనే 96 ఏళ్ల పెద్దాయన చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బుచెన్ వాల్డ్ డోరా ఇంటర్నేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా ఈయన పనిచేశారు. ఖార్కీవ్ లో ఆయన ఉంటున్న అపార్ట్ మెంట్ మీద రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో బోరిస్ రోమన్ చెన్ కో చనిపోయినట్లు ట్విట్టర్ లో వెల్లడించారు.

1943 రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రోమన్ చెన్ కో జర్మన్ క్యాంప్ నకు తరలించారు. అక్కడ నాజీ సైన్యం చేతిలో చిత్రవధ అనుభవించారు. నాజీ సైన్యం చేతిలో సుమారు 53 వేలమందికి పైగా చంపబడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ అతికొద్ది మందిలో ఈయన ఒకడు. ఆయన అదృష్టం బాగుండి బతికిబయటపడ్డాడు. అదే ఏడాది మరో మూడు ఘటనల్లోనూ ఇతడు బయటపడ్డాడు.

ఇక రోమన్ చెన్ కో మృతిపై రష్యా విదేశాంగ మంత్రి దిమిత్రి కులెబ ట్విట్టర్ లో స్పందించారు. హిట్లర్ చేతిలో నాడు మూడు నాలుగు దాడుల నుంచి తప్పించుకున్నా.. పుతిన్ చేతిలో హతమయ్యాడంటూ ఆయన రాసుకొచ్చారు. ఇక 2012లో బుచెన్ వాల్డ్ లిబరేషన్ వేడుకల్లో పాల్గొని కనిపించాడు.

నాలుగు క్యాంపుల్లో ప్రాణాలతో బయటపడ్డ రోమన్ చెన్ కోను యమజాతకుడిగా ఉక్రెయిన్ ప్రజలు అభివర్ణిస్తుంటారు. తిరిగి 2018లోనూ ఆయనను ఖార్కివ్ కు చెందిన ఓ న్యూస్ పేపర్ ఇంటర్వ్యూ చేసింది. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం నుంచి రోమన్ చెన్ కో మరణంపై అధికారిక ప్రకటన వెలువడింది.
Tags:    

Similar News